గుడ్‌న్యూస్.. హెచ్‌ఐవీ (HIV) వైరస్ కు చెక్ పెట్టె ఇంజెక్షన్ ను కనుగొన్నారు..!
HIV : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వేధిస్తున్న హెచ్‌ఐవీ (HIV) వైరస్‌ను నివారించడంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తాజాగా యెజ్టుగో (Sunlenca – Lenacapavir) అనే కొత్త ఔషధాన్ని ఆమోదించింది. గిలియడ్ సైన్సెస్ రూపొందించిన ఈ ఔషధం ప్రత్యేకత ఏమిటంటే.. ఏడాదిలో కేవలం రెండు సార్లు మాత్రమే ఇవ్వాల్సిన ఇంజెక్షన్. ఇది హెచ్‌ఐవీ నుంచి రక్షణ కల్పించడంలో అత్యంత ప్రభావవంతమైనదిగా క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపితమైంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే ఈ టీకా పొందిన 99.9% మంది వ్యక్తులు HIV నెగటివ్‌గానే ఉన్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
గుడ్‌న్యూస్.. హెచ్‌ఐవీ (HIV) వైరస్ కు చెక్ పెట్టె ఇంజెక్షన్ ను కనుగొన్నారు..!
ఈ ఔషధాన్ని లైంగిక సంబంధం ద్వారా హెచ్‌ఐవీ సంక్రమించే ప్రమాదం ఉన్న 35 కిలోల బరువుతో ఉన్న పెద్దలు, యువతకు వాడేందుకు అనుమతి లభించింది. ఇది గత రెండు దశాబ్దాలుగా పరిశోధనలో ఉన్న మెడికేషన్ కావడం విశేషం. ఇతర హెచ్‌ఐవీ నివారణ ఔషధాలతో పోలిస్తే ఇది చాలా రకాల దశల్లో వైరస్‌కి అడ్డుకట్ట వేస్తుంది. రోజూ మందులు తీసుకునే బాధ లేకుండా సంవత్సరం మొత్తానికి కేవలం రెండు డోసులతో సరిపోతుండటం వల్ల, ప్రజలు ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాలు, సామాన్యుల మధ్య ఇది విస్తృతంగా ఉపయోగపడనుంది.
యెజ్టుగో లో ఉండే ప్రధాన సమ్మేళనం లెనాకాపావిర్ అనే యాంటీరెట్రోవైరల్, హెచ్‌ఐవీ జీవిత చక్రంలో పలు దశల్లో వైరస్‌ను అడ్డుకుంటుంది. దీని ప్రభావం దాదాపు 12 నెలలపాటు శరీరంలో ఉంటుంది. ఇది కేవలం అమెరికాలోనే కాకుండా, ఇతర దేశాలనూ దీర్ఘకాలంలో ఆశాజనక మార్గం వైపు నడిపించే ఔషధంగా మారనుంది. దీనిని గుర్తించిన రోజు హెచ్‌ఐవీ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.