ఆయన వైసీపీలో ఒక కీలక నేత.. గతంలో వైసీపీ ప్రతిపక్షములో ఉన్నప్పుడు జగన్ టీంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి.. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గం నుండి గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు కానీ, కొన్ని అనివార్య కారణాలు వలన మంత్రి పదవి రాలేదు, అయినాసరే దాని గురించి ఎప్పుడు ఆయన బహిరంగంగా బాధ పడిన సందర్భాలు లేవు. ఎప్పటికప్పుడు వైసీపీ తరుపున బలమైన వాణి వినిపించే నేతగా పేరుపొందిన నేతకు సొంత సర్కార్ నుండి ఒక రకమైన షాక్ తగిలిందని చెప్పాలి.
ఆ ఎమ్మెల్యే సహకారంతో అక్రమ మైనింగ్ జరుగుతోందని గతంలో అదే పార్టీకి చెందిన కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే కూడా ఊహించని అఫిడవిట్‌ను ప్రభుత్వం దాఖలు చేసింది. దర్యాప్తు కోసం కమిటీ వేశామని .. అక్రమ మైనింగ్ జరిగిందని గుర్తించామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. క్రిమినల్ కేసులు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇప్పటి వరకూ ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదిస్తూ వచ్చిన సర్కార్, హఠాత్తుగా దర్యాప్తు కమిటీ వేశామని అక్రమ మైనింగ్ నిజమేనని చెప్పడంతో ఆ ఎమ్మెల్యేకు షాక్ తగిలినట్లయింది. ఈ కేసు మెల్లగా “ఆ”కీలక నేత వైపు వస్తుందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే… ప్రధానంగా అక్రమ మైనింగ్ జరుగుతోంది ఆ నేత అండతోనేనని.. పిటిషన్లు ఆరోపిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ కు ఇబ్బందులు తప్పవు అని తెలుస్తుంది.
సొంత పార్టీ నుండే ఫైర్ బ్రాండ్ కు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం పట్ల రాజకీయ లక్ష్యాలు వేరే ఉన్నట్లు కొందరు అంటున్నారు. ఇప్పటివరకు అయితే జగన్ కు భజన తప్ప, వ్యతిరేకంగా ఒక్క మాట్లాడలేదు ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్, అలాంటిది ఆయనకు ఉచ్చు బిగించటం ఏమిటో అర్ధం కావటం లేదంటున్నారు ఆయన అనుచరులు, ఇంతకీ ఆ కీలక లేదు ఎవరయ్యా అంటే “కెమెరా మెన్ గంగ తో ……… ” అని గుసగుసలు వినిపిస్తున్నాయి..ఇక నిజమెంతో ఆ జగన్మోహనుడికే తెలియాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్‌లోని…
This website uses cookies.