Akepati Subhashini : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ పైనే చర్చ నడుస్తోంది. అది కాస్త యూటర్న్ తీసుకొని ఎటువైపో వెళ్తోంది. కొన్ని రోజులు బండారు, రోజా వైపు మళ్లింది. తాజాగా పవన్ కళ్యాణ్ పై మళ్లింది. ఆయనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జనసేన నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకెపాటి సుభాషిణి.. సీఎం జగన్, మంత్రి రోజాపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసినందుకు మేము జగన్ మోహన్ రెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టాం. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. ఎందుకు మీకు భయం. ఈరోజు మహిళలకు ఎందుకు భయపడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి చేసింది వంద శాతం తప్పు. ఆయన తప్పు చేశాడని చెప్పడానికి ఈరోజు మహిళలం అందరం ప్రెస్ మీట్ పెట్టాం. దీంతో ఇప్పటి వరకు ఎప్పుడూ రాని పోలీసులు.. లోపల అడుగు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా మా భుజాల మీద ఉంటుంది.. అని ఆమె మండిపడ్డారు.
ఇలాంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్లకు భయపడేది లేదు. చిత్తూరు జిల్లా లీడర్లకు, టీడీపీ లీడర్లకు ధన్యవాదాలు. ఇంత లేట్ అయినా కూడా మాకు సపోర్ట్ చేశారు. న్యాయం పక్కన నిలబడ్డారు. న్యాయం గెలిచింది. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2024 లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల మీద అనవసరమైన కేసులు పెడుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతోంది. పోలీసులు మీకు నచ్చినట్టు చేయగానే కాదు. ఈ దేశంలో న్యాయస్థానం ఉంది. న్యాయం ఇంకా బతికే ఉంది. మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ క్లబ్ కు వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. న్యాయం మా వైపు ఉంది. మహిళలు అని కూడా చూడకుండా తీసుకెళ్లి జైలులో పెట్టారు. మేము తొక్కేకొద్దీ ఎదిగే వాళ్లం.. అని అధికార పార్టీకి సవాల్ విసిరారు.
ఎప్పుడూ మీరే అధికారంలో ఉండరు. మేమూ అధికారంలోకి వస్తాం అప్పుడు చెప్తాం మీ పని. అప్పుడు అధికారం మా చేతుల్లో ఉంటుంది. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు. అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. డైమండ్ రాణి నీకు సిగ్గుందా? పది మందికి అన్నం పెట్టే గుణం కాదు నీది. జనసేన జెండా త్వరలోనే రెపరెపలాడుతుంది. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. రైతులు కూడా మా వైపు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన ప్రభుత్వం మీది. బయటికి వస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతారా? చెప్పులతో కొట్టి మరీ పోలీసులు తరిమికొడతారు అని సుభాషిని మండిపడ్డారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.