Manifestos : కూటమి మేనిఫెస్టో కూడా విడుదల.. వైసీపీ, కూటమి మేనిఫెస్టో వ్యత్యాసాలివే.!
Manifestos : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం స్పీడెక్కిపోతుంది. ఎవరికి వారు మేనిఫెస్టోలని ప్రకటిస్తూ రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో విడుదల కాగా, ఇప్పుడు తాజాగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలయ్యింది. ఈ మేరకు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం..” అనే నినాదంతో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మెగా డీఎస్సీపై మొదటి సంతకం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి, దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు! , బీసీలకు 50 ఏళ్లకే పింఛను, వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. , ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్, ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం, నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ, ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మాణులకు నెలకు రూ.25వేలు గౌరవేతనం.. అలాగే వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితం.
Manifestos : కూటమి మేనిఫెస్టో కూడా విడుదల.. వైసీపీ, కూటమి మేనిఫెస్టో వ్యత్యాసాలివే.!
మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం, స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్, డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, రాజధానిగా అమరావతి కొనసాగింపుగా ఉంటుందని అన్నారు. ఇక్కడ వ్యత్యాసాలు చూస్తే.. వైసీపీ మ్యానిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లను ప్రస్తుతం ఉన్న రూ.3 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో రూ.3500కి పెంచుతామని అన్నారు. కూటమి మాత్రం వృద్దాప్య ఫించన్ ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16 వేలకు వైసీపీ చెబితే .. టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాత్రం ఏడాదికి ఏకంగా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించింది. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు అమల్లోకి తెస్తామని ప్రకటించగా.. ఎన్డీయే కూటమి అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పింది.ఇలా పలు రకాలుగా వైసీపీని మించి టీడీపీ మేనిఫెస్టో ఉంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.