BCCI : గత కొద్ది రోజులుగా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 30న భారత జట్టుని ప్రకటించింది బీసీసీఐ. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలు ప్రకటించగా, ఈ లిస్ట్ చూసి అందరు షాక్ అవుతున్నారు. ముందు ఊహించినట్టే ఎలాంటి సంచలనాలకి తావివ్వలేదు. కోహ్లీ ఉండడని ముందు అనుకున్నారు. కాని అతనికి ఛాన్స్ ఇచ్చారు. ఇక రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ చాలా రోజుల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ని ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టింది. తుది జట్టులో ఉంటారని భావించిన శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లను స్టాండ్ బై లిస్ట్‌లో చేర్చింది. మే 15లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
అయితే బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు. నిలకడగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రింకూ సింగ్‌లని ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రింకూ సింగ్‌కి టీ20లో అద్భుతమైన రికార్డ్ ఉంది. అతనిని ఎందుకు ఎంపిక చేయలేదంటూ మండిపడుతున్నారు.రాయుడు పరిస్థితి రింకూకి వచ్చిందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో రాయుడిని ఏడాది మొత్తం భారత జట్టులో నాలుగో స్థానంలో ఆడించి.. ఐపీఎల్ 2019లో విఫలమయ్యాడని 2019 ప్రపంచకప్ జట్టులో చోటివ్వలేదు. ఆయన స్థానంలో విజయ్ శంకర్‌ని తీసుకున్నారు.
ఇప్పుడు రింకూ సింగ్ పరిస్థితి కూడా అలానే ఉంది.ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన రింకూ సింగ్.. 12 మ్యాచ్‌ల్లో 262 పరుగులలు చేశాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 123 పరుగులే చేశాడు.ఈ ప్రదర్శన ఆధారంగానే అతనిని పక్కన పెట్టినట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ ఎంపికకాకపోవడానికి ప్రధాన కారణం రాహుల్ ద్రవిడేనని ఆరోపిస్తున్నారు.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.