#image_title
Nara Brahmani : ఎవరు నెక్స్ట్.. చంద్రబాబు తర్వాత టీడీపీని ముందుండి నడిపించే వ్యక్తి ఎవరు? ఆ నాయకుడు ఎవరు? అంటే నారా లోకేష్ అని చెప్పే పరిస్థితులు అయితే లేవు. బాలకృష్ణకు కూడా అంత సత్తా లేదు. మరి ఇక ఎవరు ఈ పార్టీని నడిపించాలి. చంద్రబాబు తర్వాత అంత సత్తా ఉన్న నేత ఎవరు.. అనే దానిపై మొన్నటి దాకా స్పష్టత లేదు. కానీ.. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో అప్పుడే టీడీపీకి ఒక పెద్ద దిక్కు దొరికినట్టయింది. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక నందమూరి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ అందరూ బయటికి వచ్చారు. రోడ్డు మీదికి వచ్చి నిరసన చేయడం ప్రారంభించారు.
#image_title
ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం అరాచకం అంటూ చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లు రాజమండ్రిలోనే ఉంటూ అక్కడ ధర్నా చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై నారా బ్రాహ్మణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ ఓవైపు ఢిల్లీకి వెళ్లి అక్కడ మంతనాలు చేస్తున్నా.. నారా బ్రాహ్మణి ఏపీలోనే ఉండి టీడీపీ నేతలకు, టీడీపీ అభిమానులకు భరోసా ఇస్తున్నారు నారా బ్రాహ్మణి.
చంద్రబాబు తర్వాత టీడీపీని ముందుండి నడిపించే నాయకుడు నారా లోకేష్ కాదు.. నారా బ్రాహ్మణి అంటున్నారు. ఇటీవల నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో నారా బ్రాహ్మణి అదరగొట్టేశారు. తన స్పీచ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. నారా లోకేష్ కు అంత సీన్ లేదని తెలుగు తమ్ముళ్లే అంటుండటంతో నారా బ్రాహ్మణే రంగంలోకి దిగి పార్టీని ముందుండి నడిపించాలని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఇన్ని రోజులు బ్రాహ్మణి సత్తా తెలియలేదు కానీ.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో బయటికి వచ్చి వైసీపీ ప్రభుత్వానికి ఆమె ఎదురెళ్లడం చూసి షాక్ అవుతున్నారు. టీడీపీకి సరైన నాయకురాలు ఈమెనే అంటున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం నారా బ్రాహ్మణి గురించే చర్చ నడుస్తోంది. చూద్దాం మరి ఎన్నికల వరకు నారా బ్రాహ్మణి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారో లేదో చూద్దాం. చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు పట్టి పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లే సత్తా బ్రాహ్మణిలో ఉందా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
This website uses cookies.