
#image_title
Roja : ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా రచ్చ రచ్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీలోనూ టీడీపీ నేతలు రచ్చ చేశారు. టీడీపీ సభ్యులు సభ నడవకుండా అడ్డుకున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. అయినా కూడా వైసీపీ ప్రభుత్వం మాత్రం అదరలేదు బెదరలేదు. ఇంకా ఇతర కుంభకోణాల్లో కూడా చంద్రబాబును ఇరికించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు ఇది కావాల్సిందే. ఇప్పటికి కానీ.. చంద్రబాబుకు తగిన శాస్త్రి జరిగిందని ఏపీ మంత్రి రోజా అన్నారు.
#image_title
ఆయన్ను అరెస్ట్ చేయడంపై డ్యాన్స్ కూడా చేశారు. ఇక.. చంద్రబాబు బయటికి వచ్చేది లేదని.. ఆయన చేసిన కుంభకోణాలు అన్నీ బయటపడితే ఇక చంద్రబాబు జీవితాంతం జైలులో మగ్గాల్సిందే అంటూ రోజా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ నేత పురందేశ్వరిపై కూడా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏం చేశారో తెలియాలి అంటే నేరుగా ఢిల్లీకి వెళ్లాలి. సీబీఐ ఆఫీసు, ఈడీ ఆఫీసుకు వెళ్లాలి. వాళ్లకు ఆదాయానికి మంచి ఆస్తులు లేవని వాళ్లు రాతపూర్వకంగా రాసి ఇస్తారా అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పురందేశ్వరి గతంలో ఏం మాట్లాడారో.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఆమె బీజేపీకి అధ్యక్షురాలా.. లేక బావ జాతీయ సమితికి అధ్యక్షురాలో అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ చనిపోయే ముందు రిలీజ్ చేసిన వీడియోను సీడీలు వేసి అందరికీ పంచిపెట్టారు పురందేశ్వరి. వెన్నుపోటు పొడిచిన గాడ్సేని మించిన గొడ్డుకంటే హీనం చంద్రబాబు అని ఎన్టీఆర్ చెప్పిన వీడియోలను సీడీలు వేసి అందరికీ చూపించారు. ఇప్పుడు ఏమైందో తెలియడం లేదు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడని పెద్దమనిషి.. ఆయన అరెస్ట్ అయిన రోజు నాడు.. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోంది అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అంటూ రోజా ప్రశ్నించారు.
ఈడీ విచారణ చేసి ఈరోజు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్ ఆస్తులను కూడా జప్తు చేసింది. ఇవన్నీ కేంద్రం ఎందుకు చేసింది. మీకు తెలివి లేకుండా మాట్లాడుతున్నారా? ఈరోజు రాష్ట్రంలో 42 వేల బెల్ట్ షాపులు ఉంటే.. ఒకే ఒక్క పెన్ స్ట్రయిక్ తో తీసేశారు సీఎం జగన్. టీడీపీ హయాంలో పెట్టిన బెల్ట్ షాపులన్నింటినీ తీసేశారు కానీ.. ఒక్కటి కూడా కొత్తది పెట్టలేదు. మరి ఎలా మద్యం ఏరులై పారుతోంది. భువనేశ్వరి గారి మాటలు చూస్తుంటే రాసిచ్చింది అప్పజెప్పుతున్నట్టు తెలుస్తోంది. నందమూరి వంశంలో ఎవరి గురించైనా మాట్లాడుకుంటున్నామంటే వాళ్లకు ఒక అడ్రస్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు. వాళ్లకు ఈరోజు ఈ లైఫ్ ను ఇచ్చింది ఎన్టీఆర్ గారు. అలాంటి తమ తండ్రి ఎన్టీఆర్ ను 420 చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం అయినప్పుడు ఒక్కరు కూడా చంద్రబాబును నిలదీయలేదు. ఒక్కరు కూడా తమ తండ్రికి అండగా నిలబడలేదు. దీన్ని బట్టే వాళ్లు ఎలాంటి వాళ్లో అర్థం అవుతోంది. వాళ్లు ఎలాంటి ఎమోషన్స్ లేని వాళ్లు, డబ్బు తప్ప మరో ఆలోచన లేని వాళ్లు. కాబట్టి వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్ అని రోజా మండిపడ్డారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.