Perni Nani : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు అరెస్ట్ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ పైనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన హంగామా కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ అసెంబ్లీలో విజిల్స్ వేయడం, మీసం తిప్పడం, తొడ కొట్టడం చూసి వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుకున్నారు. అసెంబ్లీలో రచ్చ చేసి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాజాగా బాలకృష్ణ చేసిన చేష్టలపై ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు.
ఇది పవిత్రమైన చట్టసభ అని కూడా ఒళ్లు మరిచిపోయి వాళ్లకు ఉన్న రుగ్మతను కూడా మనందరికీ చూపించారు. 3300 కోట్లతో ప్రభుత్వం ఒక కంపెనీతో ఒప్పందం జరిగి ఆ కంపెనీ పెట్టిన తర్వాత 3000 కోట్లు కంపెనీ పెట్టి.. 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెడితే సీమెన్స్ కంపెనీ నుంచి నయా పైసా రాకుండా ఒక్క క్లస్టర్ గానీ, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కానీ పెట్టకుండానే రూ.370 కోట్లను ఆదరాబాదరాగా డబ్బులను రిలీజ్ చేసి వెంటనే షెల్ కంపెనీల్లోకి మార్చేసి డబ్బులు ఎత్తేయడం అనేది చంద్రబాబు దొంగతనం కాదా? ఇదంతా మీకు తెలియదా? తెలిసి కూడా ఇలా చట్టసభల్లో ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు.. ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం అంటారు. జగన్ మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో.. ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు ఇస్తారేమో కానీ.. సంతకాలు ఎక్కడా పెట్టరు తెలుసుకో ముఖ్యమంత్రి గారు అంటాడు. అరె బాబు నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుపు.. కనీసం కార్పొరేటర్ గా గెలిస్తే ఎవరు ఎక్కడ సంతకాలు పెడతారో తెలుస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద సంతకాలు పెట్టలేదు అంటారు.. సంతకాలు పెట్టినవి ఇవి కావా అంటూ పేర్ని నాని 13 చోట్ల సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లను చూపించారు. ఇవన్నీ నువ్వు పెట్టిన సంతకాలే కదా అని సీఐడీ అధికారులు అడిగితే ఏమో తెలియదు.. నాకు గుర్తులేదు.. అని చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు చెప్పారు.. అంటూ పేర్ని నాని అసెంబ్లీలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.