Modi : కాషాయ రాష్ట్రాలుగా దేశం మారనుందా.. రూపాయి విలువ తగ్గడం వెనక కారణం ?
Modi : ఇటీవల ఎక్కడ చూసిన కూడా బీజేపీ BJP మంత్రం పని చేస్తుంది. పోటీ చేసిన ప్రతి చోట కూడా బీజేపీ BJP దాదాపు గెలుస్తూ వస్తుంది. ఢిల్లీలో మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది. అధికారంలోకి వచ్చేందుకు 1998 నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీకి సాధ్యం కావడంలేదు. దేశ వ్యాప్తంగా తన ఇమేజ్‌తో చారిత్రాత్మక విజయాలు అందించిన ప్రధాని మోదీ సైతం 2015, 2020 ఎన్నికల్లో బీజేపీని ఢిల్లీ శాసనసభలో గెలిపించలేకపోయారు. ఆప్ దెబ్బకు బీజేపీ తోకముడిచింది. అదే 2025లో మాత్రం సీన్ రివర్స్ అయింది. బీజేపీ కొట్టిన దెబ్బకు ఆప్‌కు సౌండ్ లేకుండా పోయింది.. బీజేపీని ఓడించేందుకు ఆప్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని కమలనాధులు సమర్థంగా ఎదుర్కొన్నారు.
Modi : కాషాయ రాష్ట్రాలుగా దేశం మారనుందా.. రూపాయి విలువ తగ్గడం వెనక కారణం ?
యమునా నీటిలో బీజేపీ విషం కలిపిందని కేజ్రీవాల్ స్థాయి నాయకుడు ఆరోపించారంటే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీలు ఎంత శ్రమించాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ విజయంలో ఎన్నో సమీకరణలు పనిచేసినప్పటికీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఆ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే మోడీ అధికారంలోకి వచ్చాక ఏమేం జరిగింది అనేది చూస్తే.. దేశంలో ద్రవ్యోల్బనం స్థాయిలు పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బనం పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిరుద్యోగం అలాగే పెరుగుతోంది. ఇక జీడీపీ కూడా తగ్గుతోంది అని ఆర్ధిక సర్వేలు చెబుతున్నాయి. మరో వైపు రూపాయి డాలర్ తో పోటీ పడలేక విలవిలలాడుతోంది. అయినా సరే మోడీ గెలుస్తూనే ఉన్నారు.
2014లో నరేంద్ర మోడీ దేశానికి తొలిసారి ప్రధాని అయినపుడు రూపాయి విలువ డాలరు తో పోలిస్తే 59.44 ఉండేది. అది 2015లో 62.30 గా ఉంది. 2016లో 67.63గా ఉంది. 2018లో 74.00 గా ఉంది. 2021లో 76.31గా ఉంది. 2022లో 81.16గా, 2023లో 83.21గా ఉంది. 2024లో 84.80గా ఉంటే 2025 జనవరి 6వ తేదీ నాటికి 85.61గా ఉంది. గత పదేళ్ళలో దాంతో డాలర్ ముందు రూపాయి ఎంతలా బక్కచిక్కిందో అర్థం చేసుకోవచ్చు అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. భారతీయ కరెన్సీ విలువ అమెరికా డాలర్ కంటే ఎపుడూ తక్కువగా ఉంటుంది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947లో అది 3.30గా ఉంది. అలా 1975 నాటికి వచ్చేదాకా 8.39 గా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో భారత కరెన్సీ మాత్రం మరీ దారుణంగా డాలర్ ముందు వెలవెల పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.