
Sonia Gandhi : ఖమ్మం నుంచి పోటీ చేయనున్న సోనియాగాంధీ ..!!
Sonia Gandhi : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అనారోగ్య కారణాల వలన ఆమె ఎక్కువగా పర్యటించడం లేదు. యూపీలో రాయబలీలో రోజురోజుకి పరిస్థితి సంకటంగా మారుతుంది. అందుకే సులువుగా ఉండే లోకసభ స్థానాలకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. పార్టీ హై కమాండ్ నుంచి సూచనలు రాగానే తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఎక్కడ పోటీ చేస్తే ఫలితాలు వస్తాయో నివేదిక చేసి ఇచ్చారు. చివరికి హై కమాండ్ ఛాయిస్ ఖమ్మం అని సమాచారం వచ్చినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. అయితే పైనుంచి అలాంటి సూచనలు లేకపోతే ఇక్కడ తీర్మానం చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ హై కమాండ్ ఏదో ప్లాన్లో ఉందని అప్పుడే సంకేతాలు వచ్చాయి.
ఇప్పుడు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయగానే ఎక్కువ మంది మెదక్ నుంచి అనుకున్నారు. తర్వాత మల్కాజ్గిరి నుంచి చేయవచ్చని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్లాన్ భిన్నంగా ఉన్నదని, పోటీ చేయబోయే స్థానం ఎవరు ఊహించని విధంగా ఖమ్మం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ అంశంపై కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి అని తెలుస్తుంది. సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్కువమంది మెదక్ నుంచి పోటీ చేస్తారని అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే మెదక్ లో బిఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం, సిద్దిపేటలో ఆ పార్టీ భారీ మెజారిటీ సాధించే అవకాశాలు ఉండడంతో మల్కాజిగిరి సేఫ్ సీటు అనే విశ్లేషణ ప్రారంభమైంది.
రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. అలాగే మినీ ఇండియా గా ప్రాచుర్యం పొందింది. మల్కాజిగిరిలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉంటారు. ఏపీ, తెలంగాణ మధ్యలో ఉండే ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని అంశంతో పరిశీలన జరుగుతుంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఇటీవల ఖమ్మం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ముఖ్య నేతలంతా పార్టీని వీడడంతో బీఆర్ఎస్ బలహీనపడింది. కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో లోక సభ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డి తో పాటు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే తెలంగాణలో స్వీప్ చేయవచ్చు అని ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో ఏపీలోను కొత్త ఆపరేటర్లు స్టార్ట్ చేశారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమార్తె వై.ఎస్.షర్మిలను ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించనున్నారు. ఏపీ కాంగ్రెస్లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.