Teegala Krishna Reddy : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కాయి. దానికి కారణం.. ఇంకో రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగడం. ఇంకో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ అంటూ తెలంగాణ ప్రజలను వేడుకుంటోంది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం.. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న వలసలే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే చాలామంది కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
కాంగ్రెస్ లోకి చేరికలు మాత్రం ఆగడం లేదు. ఈనేపథ్యంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఆయన ఒక్కరే కాదు.. ఆయన కోడలు అనితా రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. 2014 లో టీడీపీ నుంచి గెలుపొందిన తీగల.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సబితా కూడా బీఆర్ఎస్ లో చేరారు. అయితే.. బీఆర్ఎస్ లో తనకు మహేశ్వరం టికెట్ వస్తుందని ఇన్నిరోజులు తీగల ఆశించారు. కానీ.. ఈసారి మహేశ్వరం టికెట్ ను సీఎం కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు. దీంతో తీగలకు బిగ్ షాక్ తగిలినట్టయింది. అందుకే.. కాంగ్రెస్ నుంచి మహేశ్వరం టికెట్ హామీ వస్తే కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఓవైపు కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు ఘర్ వాపసీ పేరుతో తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతున్నారు. మరోవైపు ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చి చేరుతోంది. గాంధీ భవన్ కిక్కిరిసిపోతోంది. పలు పార్టీలకు చెందిన కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోంది. తాజాగా తీగల కూడా కాంగ్రెస్ లో చేరుతుండటంతో అది మహేశ్వరంలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.