Home » News » Telangana Elections Results Janasena Lost Deposits
News

Janasena Party : మ‌రోసారి తెలంగాణ‌లో ప‌రువు పోగొట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. డిపాజిట్లు కోల్పోయిన జ‌న‌సేన‌

Authored By
aruna
The Telugu News | Updated on: December 3, 2023 1:09 pm
Advertisement

Janasena Party : తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు Telangana Elections Results 2023 వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది రౌండ్లు ముగిశాయి. ఈనేప‌థ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ 41 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 8, ఎంఐఎం 5 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక‌.. తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ప‌రువు పోగొట్టుకున్నారు.

Advertisement

తెలంగాణ‌లో పోటీ చేసిన జ‌న‌సేన డిపాజిట్ కోల్పోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పోటీ చేసింది. అయితే.. క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక‌పోయింది జ‌న‌సేన‌. జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చిన ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా అంత‌గా పార్టీ ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది.

ఏపీలోనూ జ‌న‌సేన ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన పార్టీ చాలా స్థానాల్లో పోటీ చేసినా రాజోలులో మాత్ర‌మే జ‌న‌సేన గెలిచింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు స్థానాలు గాజువాక‌, భీమ‌వ‌రంలో పోటీ చేసినా గెల‌వ‌లేక‌పోయారు. రెండు స్థానాల్లో ఓడిపోయారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి