
Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన ప్రభావం పెంచుకున్న అధికార టీఆర్ఎస్‌కు ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గం మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. నియోజవర్గ నేతల్లో వర్గపోరే ఇందుకు కారణమని ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్నెపురెడ్డి మండలంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రమంతటా బలంగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అంత బలంగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలు నాయకులు కలిసికట్టుగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐక్యత లేకనే ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి రాకూడదంటే మంత్రి జోక్యం చేసుకోవాలని, అందరూ కలిసి పనిచేసేలా చేయాలని తాటి వెంకటేశ్వర్లు సూచించారు.
అంతేగాక, రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఆరు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సామాజికవర్గ నేతకు కేటాయించాలని డిమాండ్ తాటి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ జిల్లాలో గిరిజనులకు ఒకే ఒక్క పదవి ఇచ్చిందని, ఇప్పుడు వాళ్లు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లియారని చెప్పారు. కాబట్టి కొత్తగా చేపట్టబోయే ఎమ్మెల్సీ నియామకాల్లో గిరిజనుడికి అవకాశం కల్పించాలని కోరారు. అయితే, తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
ఎమ్మెల్యే మెచ్చా టీఆర్ఎస్‌లోకి వచ్చిన తర్వాతనే తాటి పలుకుబడి క్రమంగా తగ్గుతూ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మెచ్చా పార్టీలోకి రాకముందు కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించిన తాటి, ఇప్పుడు ఏ కార్యక్రమానికి హాజరుకావాలన్నా ఇబ్బంది పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. కాగా, తాటి వర్గీయులు మాత్రం పార్టీపట్ల తన బాధ్యత, గిరిజన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈKK వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.