Funds To AP : ఏపీకి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసిన కేంద్రం..!
Funds To AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులను విడుదల చేసింది. సాధారణంగా ఆర్థిక సంఘం నిధులలో గ్రామపంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% నిధులు కేటాయిస్తారు. ప్రస్తుతం విడుదలైన నిధులు ఆయా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జనాభా ప్రాతిపదికన జమ కానున్నాయి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం ఈ నిధులు కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నిధుల వాడకంపై విమర్శలు వచ్చినప్పటికీ, ఇప్పుడు నిధులు నేరుగా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేందుకు కట్టుబడి ఉన్నారు.
Funds To AP : ఏపీకి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసిన కేంద్రం..!
ఆర్థిక సంఘం విడుదల చేసే గ్రాంట్లు రెండు రకాలుగా ఉంటాయి. టైడ్ మరియు అన్ టైడ్. అన్ టైడ్ గ్రాంట్లు స్థానిక సంస్థలు జీతాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చు. టైడ్ గ్రాంట్లు పారిశుద్ధ్యం, నీటి నిర్వహణ, ఓడిఎఫ్ కార్యకలాపాలు, వర్షపు నీటి పునః వినియోగం వంటి ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఈ నిధులు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే తొలి విడత నిధులు విడుదల కాగా, ప్రస్తుతం విడుదలైనవి రెండో విడత నిధులు కావడం విశేషం.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత వెంటనే నిధుల విడుదల జరగడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి, అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ఆహ్వానం కూడా ఇచ్చారు. పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరిపిన తరువాత వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం చంద్రబాబు పర్యటన ఫలితంగా భావించబడుతోంది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి పనులు వేగవంతం కావడం ఖాయం.
White Jamun : సాధారణగా నల్ల నేరేడు పండ్లు గురించి మనందరికీ తెలుసు. తెల్ల నేరేడు పండ్లు కూడా ఉన్నాయని…
Talliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం "తల్లికి వందనం" పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తును వేగవంతం…
Personality Test : జ్యొతిష్యశాస్త్రం ప్రకారం చేతి రేఖలను బట్టి వారి భవిష్యత్తుని తెలియజేస్తారు. అలాగే చేతి వేలు పొడవును…
BRS 25 Years Celebration : ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు Telangana విలన్ నెంబర్ వన్ Congress Party…
BRS 25 Years : తెలంగాణ రాష్ట్ర Telangana State రాజకీయ చరిత్రలో మరో గొప్ప మైలు రాయిని బీఆర్ఎస్…
Indiramma housing scheme : తెలంగాణ రాష్ట్ర Telangana G ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం…
Balakrishna : 1983 నుంచి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఓ కంచుకోటగా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ 2014 నుంచి…
Kesineni Nani : టీడీపీ నేతల మధ్య పెరిగిన అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై…
This website uses cookies.