
Sharmila Kavitha : అక్కడ షర్మిల.. ఇక్కడ కవిత అన్నలతో ఫైట్..!
Sharmila Kavitha : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం రాజకీయ చర్చలకు తెరలేపింది. బీఆర్ఎస్ అధినేత అయిన తన తండ్రి కేసీఆర్‌కు లిఖిత రూపంలో కవిత పంపిన సందేశం లీకవ్వడం, ఆ లేఖ వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ లోపల కోవర్టులున్నారని ఆమె వ్యాఖ్యానించడం, బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయనే సంకేతాలుగా రాజకీయం పరిశీలిస్తోంది. ఇక ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పోలి ఉన్నాయా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
Sharmila Kavitha : అక్కడ షర్మిల.. ఇక్కడ కవిత అన్నలతో ఫైట్..!
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం జగన్, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలు, వాటి నేపథ్యంలో షర్మిల కొత్త పార్టీ పెట్టడం, చివరికి కాంగ్రెస్‌లో విలీనమవడం వంటి ఉదంతం అందరికీ తెలిసిందే. జగన్‌కి భావోద్వేగ ప్రత్యర్థిగా మారిన షర్మిల ఎలా ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారో, అలాగే కవిత కూడా బీఆర్ఎస్‌లో తనకున్న ప్రాధాన్యత కోసం మళ్లీ తెరపైకి వస్తున్నాయా? అనే అనుమానం ఊపందుకుంటోంది. బీఆర్ఎస్ ప్రస్తుతం విపక్షంలో ఉండడం, పార్టీకి సంక్షోభం ఎదురవుతున్న తరుణంలో కవిత ఎలాంటి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటారు? అన్నదే ఇప్పుడు చర్చాంశంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో కవిత కొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెడతారా? లేక బీఆర్ఎస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే, అది బీఆర్ఎస్‌కు మరో దెబ్బగా మారే అవకాశం ఉంది. గతంలో ఏపీలోని పరిస్థితులే ఇప్పుడు తెలంగాణలో రిపీట్ కావచ్చన్న ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. ఇది నిజమవుతుందా? కేవలం అంతర్గత సమస్యలకే పరిమితమవుతుందా? అన్నదానికి సమాధానం ఇవ్వగలిగేది కాలమే. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్‌పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
This website uses cookies.