Sharmila Kavitha : అక్కడ షర్మిల.. ఇక్కడ కవిత అన్నలతో ఫైట్..!
ప్రధానాంశాలు:
Sharmila Kavitha : అక్కడ షర్మిల.. ఇక్కడ కవిత అన్నలతో ఫైట్..!
Sharmila Kavitha : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం రాజకీయ చర్చలకు తెరలేపింది. బీఆర్ఎస్ అధినేత అయిన తన తండ్రి కేసీఆర్‌కు లిఖిత రూపంలో కవిత పంపిన సందేశం లీకవ్వడం, ఆ లేఖ వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ లోపల కోవర్టులున్నారని ఆమె వ్యాఖ్యానించడం, బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయనే సంకేతాలుగా రాజకీయం పరిశీలిస్తోంది. ఇక ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పోలి ఉన్నాయా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

Sharmila Kavitha : అక్కడ షర్మిల.. ఇక్కడ కవిత అన్నలతో ఫైట్..!
Sharmila Kavitha అక్కడ వైస్సార్ ఫ్యామిలీ.. ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం జగన్, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలు, వాటి నేపథ్యంలో షర్మిల కొత్త పార్టీ పెట్టడం, చివరికి కాంగ్రెస్‌లో విలీనమవడం వంటి ఉదంతం అందరికీ తెలిసిందే. జగన్‌కి భావోద్వేగ ప్రత్యర్థిగా మారిన షర్మిల ఎలా ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారో, అలాగే కవిత కూడా బీఆర్ఎస్‌లో తనకున్న ప్రాధాన్యత కోసం మళ్లీ తెరపైకి వస్తున్నాయా? అనే అనుమానం ఊపందుకుంటోంది. బీఆర్ఎస్ ప్రస్తుతం విపక్షంలో ఉండడం, పార్టీకి సంక్షోభం ఎదురవుతున్న తరుణంలో కవిత ఎలాంటి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటారు? అన్నదే ఇప్పుడు చర్చాంశంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో కవిత కొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెడతారా? లేక బీఆర్ఎస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే, అది బీఆర్ఎస్‌కు మరో దెబ్బగా మారే అవకాశం ఉంది. గతంలో ఏపీలోని పరిస్థితులే ఇప్పుడు తెలంగాణలో రిపీట్ కావచ్చన్న ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. ఇది నిజమవుతుందా? కేవలం అంతర్గత సమస్యలకే పరిమితమవుతుందా? అన్నదానికి సమాధానం ఇవ్వగలిగేది కాలమే. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.