
Today Telugu Breaking News 09-12-2023
Today Telugu Breaking News : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఇవాళ అందరు ఎమ్మెల్యేలతో పాటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో మరో రోజు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. అసెంబ్లీ కార్యక్రమాలకు కూడా కేటీఆర్ హాజరు కాలేదు. తనకు మరో రోజు అవకాశం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కోరారు. అలాగే.. టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తాం.. మీరు ముందే వెళ్లి రెండు లక్షలు రుణం తెచ్చుకోండి బ్యాంకుల్లో అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నికల ముందు అన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 9 వచ్చింది.. మరి రుణ మాఫీ ఏదని సీఎం రేవంత్ రెడ్డిని రైతులు ప్రశ్నిస్తున్నారు.
గన్ పార్క్ వద్ద అమరవీరుల స్మారకం వద్ద నివాళ్లు అర్పించి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAS) బయలుదేరారు.
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్(KCR) ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అంటే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగానూ కేసీఆర్ వ్యవహరించనున్నారు.
తెలంగాణ నూతన ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ జనరల్, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, ఇతర శాఖలు కొన్ని సీఎం రేవంత్ రెడ్డికే(CM Revanth Reddy) కేటాయించారు.
భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు ఆర్థిక, ప్లానింగ్, విద్యుత్ శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్, సివిల్ సప్లయిస్ శాఖ, దామోదర రాజనరసింహకు వైద్య శాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ శాఖ, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ శాఖ, పొన్నం ప్రభాకర్ కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ, కొండా సురేఖకు అటవీ, దేవాదాయ శాఖ, దనసరి అనసూయకు పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, టూరిజం శాఖను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.
అంతకంటే ముందు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) పుట్టిన రోజు వేడుకలు. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా ఆమె బర్త్ డే వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు, ఆమె అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈరోజు నుంచి టీఎస్ఆర్టీసీ(TSRTC) పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణకు చెందిన మహిళలకు ఉచితంగా బస్సు సర్వీసులు(Free Bus service for women in Telangana) అందించనున్నారు.
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
This website uses cookies.