
TTD : తిరుమలకి వెళ్లే రాజకీయ నేతలు జరభద్రం.. టీటీడీ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందిగా..!
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారుతుంది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మికత వాతావరణాన్ని దెబ్బతీసేలా పొలిటికల్ కామెంట్స్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. తిరుమలకు వచ్చిన పలువురు రాజకీయ నాయకులు దర్శనం తర్వాత మీడియాతో రాజకీయ విమర్శలు చేస్తున్నారని టీటీడీ తెలిపింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందంది.ఈ క్రమంలో పొలిటికల్ లీడర్స్‌ను టీటీడీ నిర్ణయం ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పొలిటికల్ లీడర్లు చానళ్లతో ఇప్పటివరకు రాజకీయ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వచ్చారు.
TTD : తిరుమలకి వెళ్లే రాజకీయ నేతలు జరభద్రం.. టీటీడీ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందిగా..!
రాజకీయ నాయకులు తిరుమలను దర్శించుకున్న అనంతరం చేస్తున్న పొలిటికల్ వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. దీంతో టీటీడీ ఈ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇకపై తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలను పూర్తిగా నిషేధించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే.. తిరుమలకు వచ్చిన వారికి మరింత ప్రశాంతత కల్పించేలా కొత్త బోర్డు ఈ విధంగా ఆలోచించింది. నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంపై ఈ రాజకీయ ప్రసంగాలతో వాతావరణం చెడిపోతున్నదని బోర్డు భావించింది.
రాజకీయ నాయకులు వారి నోటికి పని చెబుతుండడం కొందరిని ఇబ్బంది పెడుతుంది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటున్నదని టీటీడీ భావించింది. అందుకే.. ఇక నుంచి రాజకీయ ప్రసంగాలకు చెక్ పెట్టాలని బోర్డు ఇటీవల తీర్మానించింది. ఇందులో భాగంగా ఇకపై తిరుమలకు వచ్చే పొలిటికల్ లీడర్స్ రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రసంగాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. అలాంటి ప్రసంగాలకు దూరం ఉండాలని అభ్యర్థించింది. సిబ్బంది కూడా వాటిని ఎంకరేజ్ చేయొద్దని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. పొలిటికల్ లీడర్లు బీ అలర్ట్.. తిరుమలకు వెళ్లి మునుపటిలా రాజకీయ ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించండి అని నెటిజన్లు సూచిస్తున్నారు.
Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
Gold Silver Rates March 28 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేట్ మీకోసమే.…
Karthika Deepam 2 March 28th 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…
This website uses cookies.