Vijayashanthi : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 23 రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే నెల ఈ సమయం వరకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో గెలవడం కోసం ప్రధాన పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి చాన్స్ మిస్ అయితే మళ్లీ 5 ఏళ్లు ఆగాలి. అప్పటి వరకు తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఈ 20 రోజులు కష్టపడేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వేయాల్సిన కుప్పిగంతులు అన్నీ వేస్తున్నాయి పార్టీలు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పార్టీకి రోజురోజుకూ బలం పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. బీఆర్ఎస్, బీజేపీల నుంచి చాలామంది హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ముఖ్యనేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్లు కాంగ్రెస్ లో చేరారు. ఇక.. బీజేపీలో చేరిన కొన్ని రోజులకే పార్టీ విధానాలు నచ్చక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్ లోనే చేరారు.
ఇప్పుడు బీజేపీ నుంచి మరికొందరు సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. విజయశాంతి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పరిస్థితులు ఆమెకు నచ్చడం లేదు. అందుకే ఆమె బీజేపీ పార్టీ కార్యక్రమాలకు కూడా సరిగ్గా హాజరుకావడం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో తనకు ఎలాంటి ప్రాముఖ్యతను కూడా బీజేపీ ఇవ్వడం లేదు. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. చివరకు తనకు ఎన్నికల ప్రచారం చేసే నేత జాబితాలోనూ విజయశాంతికి చోటు దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయినట్టు తెలుస్తోంది.
అయితే.. విజయశాంతికి కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ప్రస్తుతం ఉన్న బీజేపీ నేతలు అందరికీ చోటు దక్కినా.. విజయశాంతికి మాత్రమే దక్కలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అసలు తనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో కాషాయం కండువాను వదిలేసి హస్తం గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందుకే త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే విజయశాంతి కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. విజయశాంతి నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో?
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.