Home » Andhra Pradesh » Why Pawan Kalyan Is Plyaing Cheap Politics
andhra pradesh

Pawan Kalyan : దీ తెలుగు న్యూస్ విశ్లేషణ : ధైర్యం లేకపోవడమా? అహంకారామా? పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: June 20, 2023, 12:00 pm
Advertisement

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఒకటే చర్చ. అదే జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి. నిజానికి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనాలు బాగానే వస్తున్నారు. ఆ జనాన్ని చూసి పవన్ కళ్యాణ్ కూడా రెచ్చిపోతున్నారు. అధికార వైసీపీ పార్టీ మీద తెగ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికార వైసీపీ పార్టీని మళ్లీ అధికారంలోకి అస్సలు రానివ్వను అంటూ వారాహి వాహనాన్ని గుద్ది మరీ చెబుతున్నారు పవన్. తన ఆవేశం మామూలుగా లేదు.

Advertisement

ఇవన్నీ పక్కన పెడితే.. అధికార వైసీపీ పార్టీ మీద మరో రకంగా బురద జల్లుతున్నారు. తనను హత్య చేయించడానికి సుపారీ ఇచ్చారట. తనకు ప్రాణగండం ఉందంటూ తన అభిమానుల ముందు బావురుమన్నారు పవన్ కళ్యాణ్. అయితే.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చూస్తే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తున్నారు. అసలు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారా? మిగితా నాయకులంతా ఏమయ్యారు. జనసేన పార్టీకి చెందిన వేరే నాయకులు కూడా పవన్ పక్కన ఎందుకు ఉండటం లేదు.. అనేది తెలియడం లేదు.

pawan kalyan

Advertisement

Pawan Kalyan : కనీసం పార్టీలో నాయకుల దిక్కు కూడా లేదా?

జనసేన పార్టీలో కనీసం నాయకుల దిక్కు కూడా లేదా? ఉన్నదే ఇద్దరు ముగ్గురు నాయకులు కాబట్టి.. ఇక ఆయన చుట్టు ఎంత మంది ఉంటారు అంటారా? ఉన్న నాయకులను అయినా తన పక్కన నిలబెట్టుకొని మాట్లాడాలి కదా. కానీ.. ఆయన ఎవ్వరికీ పార్టీలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తానే నాయకుడిగా ఉండాలని అనుకోవడం వరకు ఓకే కానీ.. ఎందుకు వేరే నాయకులను పక్కన పెడుతున్నారు. తన పార్టీలో ఉన్న నాయకులంటే పవన్ కళ్యాణ్ కు ఎందుకు అంత అహంకారం.. ఇలాగే ఉంటే.. పార్టీకి అసలు క్యాడర్ అంటూ ఉంటుందా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనిపై పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి