YS Sharmila : ఏపీలో ఎన్నికల వాతావరణం వాడి వేడిగా కొనసాగుతుంది. మరో 80 రోజుల్లో శాసనసభ ఎన్నికలు రాబోతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక వై.యస్.షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ప్రతిపక్షాలను విమర్శించే క్రమంలో జగన్ రెడ్డి గారు అంటూ మాట్లాడారు. దీంతో వై.యస్.షర్మిల వైయస్సార్ సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల వైయస్సార్ సీపీ ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి వై.యస్.షర్మిల జగన్ రెడ్డి అని అనటం బాగోలేదని అన్నారు. దీనికి వై.యస్.షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సీఎంను తాను జగన్ రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డి కి నచ్చలేదట. ఇప్పటినుంచి జగనన్న గారు అనే పిలుస్తానన్నారు. తనకు అభ్యంతరం లేదని కానీ తనకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తారా అంటూ సవాలు విసిరారు. రాష్ట్రంలో వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపించాలని, తాను అభివృద్ధి చూడటానికి సిద్ధమన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడటానికి తాను సిద్ధమని డేట్, టైం వాళ్ళు చెప్పిన తమను చెప్పమన్నా సరే మీడియా వారిని తీసుకొని వస్తానన్నారు. వైయస్సార్ సీపీ ప్రభుత్వం కట్టిన రాజధాని ఎక్కడ.. పోలవరం ఎక్కడ.. అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, వారు నడిపిన మెట్రో చూడటానికి తాను సిద్ధం అన్నారు. ఇదంతా చూసేందుకు మేధావులను కూడా పిలుద్దాం అని షర్మిల అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వై.ఎస్.షర్మిల దూకుడు పెంచారు. ఇవాల్టి నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. ఈరోజు నుంచి 9 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించనున్నారు. తొలి రోజు ఇచ్చాపురంలో పర్యటన కోసం ఆర్టీసీ బస్సులో వెళ్లారు. పలాస దగ్గర షర్మిల ఆర్టీసీ బస్సు ఎక్కారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణికులతో పాటు వై.ఎస్.షర్మిల ముఖాముఖి నిర్వహించారు. షర్మిల తో పాటు మాణిక్యం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి బస్సులో ప్రయాణించారు. శ్రీకాకుళం జిల్లా తో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో షర్మిల పర్యటిస్తారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.