Home » News » Ys Sharmila Dance At His Son Marriage
News

YS Sharmila : బాబోయ్ వైఎస్ షర్మిలలో ఈ యాంగిల్ కూడా ఉందా… కొడుకు పెళ్లిలో డాన్స్ ఇరగదీసిందిగా.. వీడియో !

Authored By
aruna
The Telugu News | Published on: February 26, 2024, 2:00 pm
Advertisement

YS Sharmila : తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేయకుండానే పక్కకు తప్పుకొని ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్తావం వర్ణాతీతం అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్న షర్మిల తాజాగా తన కుమారుడి రాజారెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి – ప్రియల వివాహ వేడుకలు మూడు రోజులపాటు చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతలా ఈ వీడియోలో ఏముంది అంటే ఈ వీడియోలో నవ దంపతులు మరియు అతిధులతో పాటు ప్రధానంగా వై.ఎస్ షర్మిల డ్యాన్స్ అందర్నీ ఆకర్షించింది అని చెప్పాలి.

Advertisement

అయితే రాజకీయపరంగా ఎప్పుడూ చిటపటలాడుతూ గుంటూరు కారం మాదిరిగా కనిపించే మన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన కుమారుడు పెళ్లిలో ఫుల్ జోష్ లో చిరునవ్వులు చిందిస్తూ డాన్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియోను వైయస్ షర్మిల పోస్ట్ చేస్తూ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులతో పాటు తెలంగాణ క్యాబినెట్ సగానికి పైగా హాజరైనట్లు సమాచారం. ఇక వీరిలో ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే , ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ , ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ , కొప్పుల రాజు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపదాస్ మున్షి కూడా హాజరవడం జరిగింది.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కమల్లు ..మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,శ్రీధర్ బాబు, జూపల్లి , పొన్నం ప్రభాకర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జెడి శీలం, మస్తాన్ వలీల్ హాజరవడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా కుమారుడి పెళ్లి వేడుకలో వై.యస్ షర్మిల చేసిన డ్యాన్స్ ఆకర్షణీయంగా మారింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి