Pushpa Movie Review : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 1,2 తెలుగు సినిమా చరిత్రలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయో తెలుసు. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం వంటి బంపర్ హిట్ అనంతరం.. బన్నీ కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా కావడం… పాన్ ఇండియా మూవీ పుష్పపై భారీ అంచనాలు తీసుకొచ్చాయి. ఇక చిత్ర బృందం రిలీజ్ చేస్తూ వచ్చిన ఒక్కో అప్డేట్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. బన్నీ ఆడియన్స్ తో పాటు సినీ అభిమానులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన పుష్ప సీరీస్ 1 ఎట్టకేలకు నేడు విడుదల అయింది. మరి తగ్గేదే లే అంటూ రిలీజ్ కు ముందు తెగ హల్ చల్ చేసిన పుష్ప రాజ్ తన మాటను నిలబెట్టుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే.. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీల సీన్ తో సినిమా మొదలవుతుంది. హీరో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో పరిచయమవుతాడు. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసుల అతనిని అరెస్ట్ చేసి చితకబాది స్మగ్లింగ్ గురించి ఆరా తీస్తారు. అలా అతను.. తనతో స్మగ్లింగ్ చేయించింది తన బాస్ పుష్ప రాజ్ అంటూ అతని కథ చెప్పడం మొదలు పెడతాడు. కథ ఓ భారీ ట్విస్ట్ తో ముగుస్తుంది. కథ పూర్తిగా రీవిల్ అయిన అనంతరం.. పుష్ప రాజ్ అతి తక్కువ సమయంలో తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ప్రియురాలు శ్రీవల్లి(రష్మీక మందన్నా) తో ప్రేమ వ్యవహారం నడిపిస్తూనే స్మగ్లింగ్ గ్యాంగ్ కి పుష్ప ఎలా నాయకత్వం వహిస్తాడనే దాని చుట్టే కథ మెత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అతన్ని అడ్డు పెట్టుకుని కోట్లు గడించిన కొండా రెడ్డిని (అజయ్ ఘోష్), అతని తమ్ముళ్ళను పుష్ప ఎలా ఎదుర్కున్నాడు..? ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్) తో మంచిగా ఉంటూనే… అతనికే ఎలా ఏసరు పెట్టాడు..? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన పుష్ప రాజ్.. తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు? అనేది అసలు కథ.
శేషాచలం అడవుల్లో నుంచి వేల కోట్ల విలువ చేసే ఎర్రచెందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తారనే దాని గురించి ఇంతకు ముందే విన్నా పూర్తి వివరాలు మాత్రం చాలామందికి తెలియదనే చెప్పాలి. అయితే ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ సుకుమార్ స్మగ్లింగ్ గురించిన వివరాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన ఈ చిత్రం సీక్రెట్ స్మగ్లింగ్ అంశాలను ప్రపంచానికి తెలియజేసేలా అద్భతంగా తెరకెక్కించారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో మాస్ అంశాలను చూపిస్తూనే.. ఇటు మదర్ సెంటిమెంట్, అటు లవ్ సెంటిమెంట్ క్యారీ చేశారు సుకుమార్. భారీ పోరాట సన్నివేశాల నడుమ.. మధ్య మధ్యలో తెర మీదకు వచ్చే ఈ ఉద్వేగభరిత సంఘటనలు ప్రేక్షకులను ఏమోషనల్ అయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా పుష్ప రాజ్ తన మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లో అంత వినోదాన్ని పండించాడు. ఇక క్లయిమాక్స్ లో ఒకటి ఎక్కువుంది అంటూ గుండెలోని కసిని వ్యక్తం చేసిన తీరూ అమోఘమనే చెప్పాలి.
చిత్రం : పుష్ప – ది రైజ్
నటీ నటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, సునిల్, ప్రకాష్ రాజ్ , జగపతి బాబు, అనసూయ, అజయ్ ఘోష్, శత్రు తదితరులు.
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు : నవీన్ యేర్నేని, వై. రవి శంకర్
దర్శకత్వం: సుకుమార్
విడుదల తేది : 17-12-2021
ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పాల్సింది సుకుమార్ ఎంచుకున్న నటీనటుల గురించి.. తను రాసుకున్న కథలకి పర్ఫెక్ట్ గా సరిపోయే నటీనటులను ఎంచుకున్నారు. పుష్ప రాజ్ పాత్రకు తను తప్ప మరెవరూ సూట్ అవ్వరని ప్రూవ్ చేశాడు బన్నీ. ఇప్పటివరకు స్టైలిష్ స్టార్ గా డ్యాన్సర్ గా రుజువు చేసుకున్న కి ఐకాన్ స్టార్.. నాచురల్ గెటప్ లో ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తిగా, తన మాటే నెగ్గాలనే తత్త్వమున్న మొరటోడిగా బన్నీ బాగా చేశాడు. తగ్గేదే లే అనే మేనరిజాన్ని ఒక్కో చోటా ఒక్కోలా పలికి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో అయితే బన్నీ నటన బీభత్సమని చెప్పాలి. ఈ పుష్ప రాజ్ ఈసారి జాతీయ అవార్డుకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎప్పుడు మోడరన్ క్యూట్ లుక్ తో కనిపించే రష్మిక ఈ సినిమాలో పాలమ్ముకునే ఊరి పిల్లగా అదరకొట్టింది. పల్లెటూరి యాసలో, కట్టు, బొట్టులో ఆమె ఆ పాత్రలో ఒదిగి పోయింది. పుష్పతో ప్రేమను వ్యక్తపరిచే సీన్ లో తన నటన అద్భుతమనే చెప్పాలి. అంతలా ఆ పాత్రలో ఆమె జీవించి పోయింది. ఇక ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్ గా యాక్ట్ చేశాడు.
కమెడియన్ గా తనకున్న ఇమేజ్ పూర్తిగా తొలగిపోయి ఈ సినిమా తర్వాత అతనికి మరిన్ని విలన్ పాత్రలు వస్తాయని బల్ల గుద్ది చెప్పవచ్చు. రంగస్థలంలో రంగమత్త గా అలరించిన అనసూయ ఈ సినిమాలో దాక్షాయినిగా తన నటనతో మరోమారు మెప్పించింది. వీటితో పాటు సమంత ఐటెం సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. సామ్ అందాలను ఆరబోస్తూ.. తన డ్యాన్స్ తో థియేటర్ అంతా స్టెప్పులు వేయిస్తుంది. అయితే విలన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ టాలెంటెడ్ నటుడు ఫాహద్ ఫాజిల్ కు మొదటి పార్ట్ లో నిరాశ పరుస్తాడు. క్లయిమాక్స్ కు కాస్తంత తెరపైకి వచ్చి కొంత నిరాశకు గురిచేశాడు. అయితే రెండో భాగం లో ఆయన పాత్రకు భారీ ప్రాధాన్యత ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రావు రమేష్ పాత్రలకు కూడా వచ్చే పార్ట్ లో మరింత స్క్రీన్ స్పేస్ దక్కే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు అజయ్ ఘోష్, శత్రు, హరీష్ ఉత్తమన్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.
ప్లస్ పాయింట్స్:
– అల్లు అర్జున్ యాక్టింగ్
– ప్రధాన పాత్రల నటన
– స్క్రీన్ ప్లే
– ట్విస్ట్ లు
– దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
– రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్
మైనస్ పాయింట్స్:
– కొన్నిచోట్ల నెమ్మదిగా నడిచే కథనం
– మూవీ రన్ టైం
– బలహీనమైన క్లైమాక్స్
ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చినా.. పుష్ప సినిమా స్పెషల్ అని చెప్పుకోవాలి. అడవిలో ఏ మూలాన ఏం జరుగుతుందో దర్శకుడు సుకుమార్ కళ్ళకు కట్టినట్లు చూపించారు. మొత్తానికి ఈ సినిమా బన్నీ అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. మరి ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
రేటింగ్ : 3.5
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.