Guntur Kaaram Movie Review : గుంటూరు కారం మూవీ ఫస్ట్ రివ్యూ | సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu మరియు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ Trivikram Srinivas కాంబినేషన్లో రాబోతున్న మూడో మూవీ గుంటూరు కారం మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఇక ఈ మూవీ ను ఎస్. రాధాకృష్ణ S. Radha Krishna ( Haarika & Hassine Creations ) నిర్మించగా, ఎస్.ఎస్.తమన్ సంగీత Thaman S దర్శకత్వం అందించారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయని చెప్పాలి. అదేవిధంగా తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల Sreeleela మరియు మీనాక్షి చౌదరి Sreeleela, Meenakshi Chaudhary నటించారు. రమ్యకృష్ణ మరియు జగపతిబాబు Jagapathi Babu ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇక డిసెంబర్ 12న విడుదల సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా Social Media లో దీనికి సంబంధించిన రివ్యూ తెగ వైరల్ అవుతుంది. అయితే సినిమా ఇంకా ప్రేక్షకులు ముందుకు రాలేదు. కాబట్టి కథకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు.
మరి ట్విట్టర్ Guntur Kaaram Movie Twitter Review అందించిన రివ్యూ ప్రకారం… ఈ సినిమాలో చిన్నప్పుడే కుటుంబానికి అనుకోకుండా దూరమైన హీరో , పోకిరిగా మారి తిరిగి తన ఫ్యామిలీ ఎదురు పడినప్పుడు ఏం చేశాడు అనే కథపై సాగుతుందని సమాచారం. ఇక ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫుల్ మాస్ ఫైట్ సీన్స్ తో దర్శకుడు దుమ్ము లేపేసాడు. ఇక సెకండాఫ్ లో మాటల మాంత్రికుడు తన మాయమాటలతో అందర్నీ కట్టిపడేసాడని సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లుగానే మహేష్ బాబు Mahesh Babuను గతంలో ఎప్పుడూ చూడని విధంగా చూపించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ మరియు మాస్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఆకట్టుకుంటాయని టాక్ వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా రమ్యకృష్ణ Ramya Krishna మరియు మహేష్ బాబు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని సమాచారం.
అలాగే మహేష్ బాబు Super Star Mahesh Babu మరియు శ్రీలీల Sreeleela మధ్య వచ్చే సీన్స్, కుర్చీని మడతపెట్టి అనే పాటకు ప్రేక్షకుల నుండి ఈలలు, గోలలు ఖాయమని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి గుంటూరు కారం సినిమా మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని స్పష్టమవుతుంది. ఇక సినిమా మొత్తం మహేష్ బాబు డామినేషన్ పూర్తిగా కనిపిస్తుందని తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ Trivikram Srinivas సినిమాలలో హీరో కంటే కథ మరియు ఆయన డైలాగులు ఎక్కువ డామినేట్ చేస్తాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు అన్నింటిని మించి తన నటనతో డామినేట్ చేశాడని తెలుస్తోంది. ఇక గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు తన అభిమానులకు మాస్ గిఫ్ట్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో సత్తా చూపిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విడుదల అవటానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది …
వెంకటస్వామి ( ప్రకాష్ రాజ్ )ఒక రాజకీయ నాయకుడు. అతడి కూతురు వసుంధర ( రమ్య క్రిష్ణ) కూడా రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తుంది. వసుంధరకి మొదట సత్య ( జయరాం)తో పెళ్లి జరుగుతుంది. వాళ్లకి పుట్టిన కొడుకు రమణ ( మహేష్ బాబు ) . కానీ ఊర్లో గొడవలు రావడం అందులో ఆమె భర్త ఉండడంతో భర్తని కొడుకుని గుంటూరులో వదిలేసి హైదరాబాదులో ఉన్న తన తండ్రి దగ్గరికి వసుంధర వచ్చేస్తుంది అక్కడ రెండోసారి నారాయణని ( రావు రమేష్ ) పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకి రాజగోపాల్ ( రాహుల్ రవీంద్రన్ ) అని కుమారుడు ఉంటాడు. వెంకటస్వామి తన నిజమైన వారసుడు రాజగోపాల్ అని చెప్పుకుంటూ, అతడిని కూడా ఎన్నికల్లో పోటీ చేయించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే మొదటి వారసుడు రమణని హైదరాబాద్ పిలిపించుకొని తనకి ఆస్తి అవసరం లేదు అని, వసుంధరకి తనకి సంబంధం లేదని దస్తావేజు కాగితాల మీద సంతకం పెట్టమని చెబుతూ ఉంటాడు. వెంకటస్వామి వకీలు పాణి ( మురళీ శర్మ ) రమణ తో ఎలా అయినా సంతకం పెట్టిస్తాను అని చెప్పి తన కూతురు అమ్ములు ( శ్రీలీల) ని గుంటూరు పంపిస్తాడు. అమ్ములు, బాలు ( వెన్నెల కిషోర్ ) తో గుంటూరు వెళుతుంది. కానీ ఆమె రమణతో ప్రేమలో పడుతుంది. ఇంతకీ రమణ సంతకం పెట్టాడా.. ? రమణకి తల్లి వసుంధర అంటే ఎందుకు కోపం ..? వెంకటస్వామి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎటువంటి రాజకీయ ఎత్తులు వేశాడు.. చివరికి ఏమైంది.. అనే విషయాలు తెలియాలంటే గుంటూరు కారం సినిమా చూడాల్సిందే.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాటల మాంత్రికుడు అని పేరు ఉంది. అందుకని ఆయన సినిమాలలో చిన్న చిన్న సరదా మాటలు రాస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు అలాగే అతడి మాటల్లో చిన్న వెటకారం, చిలిపితనం, ప్రాస ఇవన్నీ ఉంటాయి. అందుకే అతని మాటలని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం మహేష్ బాబుని ఎలా కావాలో అలా చూపించాలని అనుకున్నాడు. అందుకే మహేష్ దృష్టిలో పెట్టుకొని మాటలు రాశాడు. తల్లి సెంటిమెంట్ నేపథ్యంగా ఎంచుకొని మహేష్ ని ఒక మాస్ యాంగిల్ లో చూపించాలి అనుకున్నారు. మొత్తం సినిమా అంతా మహేష్ బాబు మీదే ఉంటుంది. సరదాగా సాగుతూ మధ్యలో మహేష్ బాబు తో డాన్సులు, పోరాట సన్నివేశాలు చేస్తూ మొదటి సగం పూర్తి చేయిస్తాడు. ఇక రెండో సగంలో కథ గురించి ఒక్కొక్కటి విప్పుకుంటూ వెళతారు. జయరాం, మహేష్ బాబు తండ్రి కొడుకులు ఎందుకు గుంటూరులో ఉన్నారు. మహేష్ బాబు తల్లి రమ్యకృష్ణ కలుద్దాం అని వస్తే ఆమె ఎప్పుడూ అతడిని కలవదు. ఒకరంటే ఒకరికి పడనట్టు ఉన్న వారిద్దరి మధ్య ఉండే ఆ తల్లి కొడుకుల అనుబంధాన్ని వాళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ని బాగా చూపించగలిగాడు డైరెక్టర్. రమ్యకృష్ణ మీద దాడులు జరుగుతాయి. అందరూ అది వేరే వాళ్ళు చేయించారు అని అనుకుంటారు చివరకు అది ఎవరు చేయించారు అనేది తెలిశాక అందరికీ ఒక షాక్ ఉంటుంది. సినిమాకి సంగీతం కూడా బాగుంది. ఛాయాగ్రహం కూడా బాగుంటుంది. అలాగే ఈ సినిమా కృష్ణ గారి అభిమానులకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే సినిమాలో కృష్ణ గారి రిఫరెన్స్ చాలా చోట్ల ఉంటుంది. ఇక శ్రీ లీల డ్యాన్స్ తో అదరగొట్టింది ఆమె నటన కూడా బాగుంది. మీనాక్షి చౌదరి అతిథి పాత్రలో మెప్పించారు. ఇక ప్రకాష్ రాజ్ కి చాలా కాలం తర్వాత మంచి పాత్ర వచ్చింది. అతనికి ఇలాంటివి కొట్టినపిండి అందుకని చేసుకుపోయాడు. ఇక రమ్యకృష్ణ తల్లిగా చాలా బాగా చేశారు. మురళీ శర్మ లాయర్ గా చేశారు అతనికి ఇది రెగ్యులర్ పాత్ర. వెన్నెల కిషోర్ సినిమాలో చాలా సేపు కనబడతారు. అలాగే నవ్విస్తాడు కూడా. రావు రమేష్ అక్కడక్కడ కనబడినా క్లైమాక్స్ లో మాత్రం ఒక్కసారి మెరుస్తాడు. బ్రహ్మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ గా బాగా చేశారు. ఈశ్వరి రావుకి సినిమాలో మంచి పాత్ర లభించింది. అజయ్ ఘోష్, రాహుల్ రవీంద్రన్ మిగతా అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సెంటిమెంట్
ఎమోషనల్ సీన్స్
మహేష్ బాబు నటన
శ్రీ లీల డ్యాన్స్
డైలాగ్స్
త్రివిక్రమ్ స్టోరీ
బీజిఎమ్ మ్యూజిక్
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.