Guntur Kaaram Movie Review : గుంటూరు కారం మూవీ రివ్యూ వచ్చేసింది .. ఎలా ఉందంటే..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guntur Kaaram Movie Review : గుంటూరు కారం మూవీ రివ్యూ వచ్చేసింది .. ఎలా ఉందంటే..??

Guntur Kaaram Movie Review : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ Mahesh Babu గుంటూరు కారం ‘  Guntur Kaaram సినిమా విడుదలకు రెడీగా ఉంది.సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ ను పూర్తిచేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ ను కూడా పొందింది. ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమా విడుదలకు ముందే రివ్యూ బయటికి వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మాస్, ఎమోషన్, కామెడీ, […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 January 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Guntur Kaaram Movie Review : గుంటూరు కారం మూవీ రివ్యూ వచ్చేసింది .. ఎలా ఉందంటే..??

  •   గుంటూరు కారం మూవీ సంక్రాంతి జనవరి 12న విడుదల

  •  సూపర్ స్టార్ మహేష్ బాబు ' గుంటూరు కారం ' సినిమా విడుదలకు రెడీగా

Guntur Kaaram Movie Review : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ Mahesh Babu గుంటూరు కారం ‘  Guntur Kaaram సినిమా విడుదలకు రెడీగా ఉంది.సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ ను పూర్తిచేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ ను కూడా పొందింది. ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమా విడుదలకు ముందే రివ్యూ బయటికి వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మాస్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ అన్నీ కలిపి తెరకెక్కించారు. అలాగే డైరక్టర్ త్రివిక్రమ్ మహేష్ బాబు పాత్ర మీద ఎక్కువ దృష్టి పెట్టారట. సినిమా కథ విషయానికి వస్తే హీరోయిన్ శ్రీ లీల ధనవంతురాలట. తనకు లేదనేది ఉండదట. అలాంటి అమ్మాయి కొద్దిరోజుల్లో చనిపోతుందట. అలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చిన మహేష్ బాబు ఏం చేశాడు అన్నదే కథ.

సినిమాలో ట్విస్టులు అలరిస్తాయి అంటున్నారు. గుంటూరు కారం సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అని అంటున్నారు. మహేష్ బాబు మీద త్రివిక్రమ్ తీసిన సన్నివేశాలు మైండ్ బ్లాక్ చేసేలా ఉంటాయట. ఇక మహేష్ బాబు శ్రీలీల రొమాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. అభిమానులతో పాటు సినీ లవర్స్ ని ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందట. గుంటూరు కారం సంక్రాంతి సినిమాకి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. సినిమా విడుదలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుక చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో పోలీసులు అనుమతులు ఇవ్వలేదు.

ఇది రాజకీయ కక్ష వాదింపు అని కొందరి వాదన. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. గతంలో ఖలేజా, అతడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడవదిగా గుంటూరు కారం సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించారు. అన్ని విధాలుగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతికి గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది