Kaduva Movie Review and Rating in Telugu
Kaduva Movie Review : గతంలో తెలుగు హీరోలు మాత్రమే మనకు పరిచయం ఉండేది. కాని ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోలు కూడా తెలుగులో సత్తా చాటుతున్నారు. వారిలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఈ హీరో నటించిన తాజా చిత్రం కడువా. ఈ మూవీ తెలుగుతో పాటు పలు భాషలలో విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈసారి కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రయత్నించాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఎంతమేర ప్రేక్షకులని మెప్పిస్తుందో సమీక్షలో చూద్దాం పదండి.
కథ : కడువాకునేల్ కురియచెన్ చేతన్(పృథ్వీ రాజ్) తాను ఉండే ప్రాంతంలో ఒక గౌరవంగా లైఫ్ ని లీడ్ చేసే పెద్ద వ్యక్తిగా కనిపిస్తాడు. ఊహించని మలుపుతో ఐజీ థామస్ చండీ(వివేక్ ఒబెరాయ్) ఎంటర్ అవుతాడు. దీనితో అంతా పోలీస్ డిపార్ట్మెంట్ వర్సెస్ కడువా లా మారిపోతుంది. అయితే ఈ ఇద్దరు ఎందుకు ఇంతలా వైరం పెంచుకోవాల్సి వస్తుంది.? మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కడువా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా? గొడవలు ఎలా పరిష్కారం అయ్యాయి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పర్‌ఫార్మెన్స్ : పృథ్వీ రాజ్ నటన ఎలా ఉంటుందో బాగా తెలుసు. అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో కూడా పృథ్వీ అదరగొట్టాడు. తన మార్క్ పంచ్ డైలాగ్స్ గాని తన లుక్స్ తో గాని అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటాడు. అలాగే మరో పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ అయితే మళ్ళీ విలన్ గా సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. తనలోని ఇంటెన్సిటీ తో మంచి పవర్ ఫుల్ గా సినిమాలో కనిపించి మెప్పించాడు. మిగతా స్టార్స్ కూడా పర్వాలేదనిపించారు. పలు చోట్ల స్క్రీన్ ప్లే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మెయిన్ లీడ్ మధ్య పెట్టిన కాన్ ఫ్లిక్ట్ కూడా మంచి మెప్పించే రకంగా ఉంటుంది.
Kaduva Movie Review and Rating in Telugu
ఇక భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. సెకండాఫ్ లో ఈ చిత్రం అంతా చాలా సింపుల్ గా ఫ్లాట్ గా అనిపిస్తుంది. దీనితో సినిమా డల్ గా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో నరేషన్ కూడా అంత ఆకట్టుకునేలా కనిపించదు. చాలా వరకు తెలిసినట్టుగా ఉండే నరేషన్ సెకండాఫ్ లో కనిపిస్తుంది. చాలా చోట్ల సినిమా బోర్ కలిగిస్తుంది. అభినందన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అలాగే జేక్స్ బిజోయ్ ఇచ్చిన సంగీతం ముఖ్యంగా కొన్ని మాస్ సీన్స్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా అనిపిస్తుంది. ఇంకా ఎడిటింగ్ లో చాలా వరకు ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఇక దర్శకుడు షాజీ కైలాష్ విషయానికి వస్తే తన వర్క్ ఓకే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాని బాగానే చూపించాడు
విశ్లేషణ : “కడువా” చిత్రం లో హీరో మరియు విలన్ మధ్య కనిపించే మాస్ ట్రీట్మెంట్ బాగుంటుంది, కానీ సెకండాఫ్ లో ఎలాంటి పొంతన లేకపోవడం, అంతగా ఆకట్టుకునే కథనం కనిపించకపోవడం నిరాశ కలిగిస్తుంది. కొత్తదనం కోరుకునే వారు సినిమాని అంతగా మెచ్చకపోవచ్చు.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.