Tiger Nageswara Rao Movie Review : అన్ని సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా మరో ఎత్తు. టైగర్ నాగేశ్వరరావు Tiger Nageswara Rao అనేది ఏదో ఫిక్షనల్ స్టోరీ కాదు. ఒక వ్యక్తి స్టోరీ. ఇంతకీ ఆ వ్యక్తి ఏమైనా సెలబ్రిటీనా? స్వాతంత్ర సమరయోధుడా? లేక రాజకీయ నాయకుడా? లేక ఆటగాడా? సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా అంటే అస్సలు కాదు.. అతడు ఒక దొంగ. అవును.. ఓ దొంగ బయోపిక్ అని చెప్పుకోవచ్చు. ఒక దొంగ జీవితాన్ని ఆధారంగా చేసుకొని టైగర్ నాగేశ్వరరావు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆ దొంగగా మాస్ మహారాజా రవితేజ నటించారు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. స్టూవర్టుపురం అనే పేరు మీరు వినే ఉంటారు కదా. ఇప్పుడు కాదు కానీ.. 1970 వ దశకంలో స్టూవర్టుపురంలో టైగర్ నాగేశ్వర రావు అనే వ్యక్తి పెద్ద గజదొంగ. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
పాన్ ఇండియా మూవీగా టైగర్ నాగేశ్వరరావు మూవీ తెరకెక్కింది. రవితేజ Ravi Teja తొలి పాన్ ఇండియా మూవీ Pan India Movie అని చెప్పుకోవచ్చు. దసరా dussehra కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూను వేశారు. విదేశాల్లో కూడా ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. దీంతో ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో రివ్యూలు కూడా వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. ఇక రవితేజ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అసలు సినిమా ఎలా ఉందో.. రవితేజ నటన ఎలా ఉందో చెబుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుక్రీతి వాస్ నటించారు. వీళ్లంతా కొత్త నటీమణులే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ renu desai కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఆమె దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు.
నటీనటులు : రవితేజ, Ravi teja, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, అనుక్రీతి వాస్ తదితరులు
డైరెక్టర్ : వంశీ కృష్ణ
నిర్మాత : అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్
విడుదల తేదీ : 20 అక్టోబర్ 2023
నిజానికి బయట జనాలకు టైగర్ నాగేశ్వర రావు ఒక దొంగ. మామూలు దొంగ కాదు గజదొంగ. కానీ.. ఆయనలో జనాలకు తెలియని మరో కోణం కూడా ఉందట. అదే తను మనసున్న మనిషి అని.. ఆ కోణాన్నే ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. రావణాసుర మూవీ ఫ్లాప్ తర్వాత ఒక మంచి సినిమా చేయాలని రవితేజ ఈ సినిమాను చేశారు. ఈ సినిమాపై రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. అయితే.. టైగర్ నాగేశ్వరరావు రియల్ గా చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు. దీంతో ఈ సినిమాలో కూడా రవితేజ క్యారెక్టర్ ను డైరెక్టర్ చంపేశాడా? లేక.. క్లైమాక్స్ మార్చాడా? అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా కథలోకి మనం వెళ్లాల్సిందే.
ఇది ఇప్పటి కథ కాదు. 1980 నాటి కథ. స్టువర్టుపురం నాగేశ్వరరావు(రవితేజ) ఒక గజదొంగ. ఆయన దొంగతనాలు చేసే స్టైలే వేరు. పోలీసులకు చెప్పి మరీ దొంగతనాలు చేసేవాడు. అయితే.. దొంగతనాలు చేస్తున్నాడు కదా చెడ్డవాడు కావచ్చు అని అంతా అనుకుంటారు కానీ.. పేదల పక్షాన, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి. స్టువర్టుపురంలో ఉండే భూస్వాములు, రౌడీలు.. అక్కడ ఉన్న ప్రజల భూములను, వాళ్ల ఆస్తులను దౌర్జన్యం చేసి లాక్కుంటే స్టువర్టుపురం ప్రజలకు అండగా నిలుస్తాడు నాగేశ్వరరావు. దీంతో నాగేశ్వరరావును స్టువర్టుపురం ప్రజలు ఒక హీరోగా చూస్తారు. మరోవైపు పోలీసులకు చాలెంజింగ్ గా మారిన నాగేశ్వరరావును పట్టుకునేందుకు కొత్త పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఒక దొంగతనం చేస్తూ నాగేశ్వరరావు పోలీసులకు పట్టుబడతాడు. కొన్నేళ్ల పాటు జైలు జీవితం గడిపి తిరిగి స్టువర్టుపురం వస్తాడు నాగేశ్వరరావు. అప్పుడు ఇంకా పెద్ద దొంగగా మారుతాడు. అప్పుడు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తాడు. ఆ తర్వాత స్టువర్టుపురం నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా మారుతాడు. అసలు.. ఆయన అలా ఎందుకు మారాడు? పోలీసులు ఎందుకు నాగేశ్వరరావును చూసి భయపడేవారు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.
ఈ సినిమా 2019 లోనే స్టార్ట్ అయినా ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదల కావడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. ఈ సినిమాకు ముందు చాలామంది హీరోలను అనుకున్నా చివరకు రవితేజ ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. టైగర్ నాగేశ్వర రావు పాత్రకు రవితేజ కరెక్ట్ గా సూట్ అయ్యాడు. ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాలో చాలా సీన్ల కోసం కొన్ని నెలల పాటు షూటింగ్ తీయాల్సి వచ్చిందని డైరెక్టర్ చెప్పారు. కొన్ని గ్రాఫిక్స్ చేయడం కోసం చాలా నెలల సమయం తీసుకున్నారట. అలాగే.. స్టూవర్టుపురం అనే గ్రామాన్ని తలపించేలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెద్ద సెట్ ను వేసింది మూవీ యూనిట్.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. ప్రధాన మంత్రిగా నటించాడు. గుంటూరు ఎస్పీగా మురళీ శర్మ నటించాడు. ప్రధాన మంత్రికి.. ఆయన టైగర్ నాగేశ్వరరావు కథ చెబుతాడు. ఇక.. ఈ సినిమాలో సారాగా నటించిన నుపుర్ సనన్ అద్భుతంగా నటించింది. స్టువర్టుపురం దొంగ గురించి ప్రధాన మంత్రికి కూడా తెలిసింది అంటే అతడు ఎంత పవర్ ఫుల్ దొంగో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ సీన్స్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్
కథ
యాక్షన్ సీన్స్
రవితేజ నటన
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
వీఎఫ్ఎక్స్ షాట్స్
రన్ టైమ్
ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్
లవ్ ట్రాక్
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.