Toxic Movie Twitter Review Live Updates : టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. లైవ్ అప్‌డేట్స్..!
Toxic Movie Twitter Review Live Updates : రాకింగ్ స్టార్ యశ్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమాలే. ఈ రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యశ్.. ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ‘టాక్సిక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘టాక్సిక్’ మేనియా కనిపిస్తోంది. యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న ‘టాక్సిక్’ గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా సందడి మొదలైంది. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ భారీగా సక్సెస్ కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. మరోవైపు బుక్‌మైషోలో కూడా టికెట్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. గంటకు 60 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. విడుదలకు ముందే ఈ స్థాయిలో క్రేజ్ ఉంటే.. సినిమా రిలీజ్ తర్వాత గంటకు లక్ష టికెట్లు అమ్ముడైనా ఆశ్చర్యపోనవసరం లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
Toxic Movie Twitter Review Live Updates : టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. లైవ్ అప్‌డేట్స్..!
Toxic Movie Twitter Review Live Updates ‘టాక్సిక్’కు A సర్టిఫికెట్.. భారీ రన్‌టైమ్
‘టాక్సిక్’ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో 18 ఏళ్లకు పైబడిన ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపు వారికి సినిమా ప్రదర్శనకు అనుమతి ఉండదు. ఇక ‘టాక్సిక్’ రన్‌టైమ్ కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 15 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. అయితే సినిమా ఏ భాషలో ప్రదర్శితమవుతుందనే దానిని బట్టి రన్‌టైమ్‌లో కొంత మార్పు ఉండొచ్చు. ముఖ్యంగా కన్నడ వెర్షన్ నిడివి 3 గంటల 30 నిమిషాలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మించారు. ఈ సినిమాలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.
Toxic Movie Twitter Review Live Updates ‘టాక్సిక్’ ట్విట్టర్ రివ్యూ.. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు!
ఇక సినిమా చూసిన ప్రేక్షకులు, సోషల్ మీడియాలో వస్తున్న తొలి స్పందనలను పరిశీలిస్తే.. ‘టాక్సిక్’లో యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన హైలైట్‌గా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. యశ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన యాక్షన్, స్టైల్, ఎలివేషన్ సన్నివేశాలు అభిమానులను మెప్పించాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో సినిమాలో అడల్ట్ కంటెంట్, సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసినట్లు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని, భారీ యాక్షన్ ఎలివేషన్స్ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచాయని టాక్ వినిపిస్తోంది.
విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ‘టాక్సిక్’ ఏమాత్రం తగ్గలేదని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విజువల్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా యశ్‌ను భారీ స్కేల్‌లో చూపించిన విధానం అభిమానులను ఆకట్టుకుందని అంటున్నారు.మొత్తంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న తొలి స్పందనలను బట్టి ‘టాక్సిక్’ హ్యూజ్ బ్లాక్‌బస్టర్.. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అంటూ అభిమానులు, ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇవన్నీ సినిమా విడుదలకు ముందు వస్తున్న సోషల్ మీడియా/ట్విట్టర్ స్పందనలు మాత్రమే. పూర్తి స్థాయి సినిమా రివ్యూ, కథ ఎలా ఉంది? యశ్ నటన ఎలా ఉంది? గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన విధానం ఎలా ఉంది? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
