మాస్టర్ సినిమా కోసం కోలీవుడ్ మొత్తం గత 8 నెలలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మాస్టర్ సినిమా విజయ్ కి ఛాలెంజింగ్ సినిమా. ఈ సినిమా విషయంలో ఎన్నో చర్చలు సాగాయి. అందరినీ ఎదురించి నిలబడ్డాడు. ఓటీటీ ఓత్తిడి చేసిన తలవంచలేదు. సూర్య లాంటి స్టార్ హీరో ఆకాశం నీ హద్దురా సినిమా కోసం థియేటర్స్ ఓపెన్ చేసేవరకు ఆగలేకపోయాడు. కాని విజయ్ మాత్రం ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా కూడా మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్సైయ్యాడు. మాస్టర్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
దర్శకుడు లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మాస్టర్ సినిమా కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ గాని .. థియేట్రికల్ ట్రైలర్ గాని రిలీజ్ కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో 200 కోట్ల బిజినెస్ జరిగిందంటే బాక్సాఫీస్ వద్ద విజయ్ సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతకొంతకాలంగా విజయ్ చేసిన సినిమాలన్ని భారీ కమర్షియల్ సక్సస్ లను సాధిస్తూ కోలీవుడ్ స్టార్స్ హీరోలని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో పోటీ పడుతున్నాడు విజయ్.
జిల్లా సినిమా నుంచి కత్తి, సర్కార్, తేరీ, మెర్సిల్, బిగిల్ వరకు.. ప్రతీ సినిమాతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మాస్టర్ సినిమా మీద అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా ఎట్టకేలకి మాస్టర్ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. అయితే ఇప్పటికే జరిగిన బిజినెస్ పరంగా ఇప్పటి వరకు కోలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలైపోయాయని చెప్పుకుంటున్నారు. ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నమాస్టర్ తో విజయ్ ఇండస్ట్రీ హిట్ సాధించబోతున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా తెలుగులోనే 160 స్క్రీన్స్ లో ప్రదర్శనకి రెడీ అయింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.