Wanted PanduGod Movie Review : ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు కొన్ని చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే . ఈ వారం నాలుగు సినిమాలు సందడి చేసేందుకు సిద్ధం కాగా, వాటిలో వాంటెడ్ పండుగాగ్ ఒకటి. సునీల్, అనసూయ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రం కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ పతాకంపై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఈ నెల 19న విడుదలకానుంది.
ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్స్ అందరూ భాగం కావడంతో కావాల్సినంత వినోదం పండిందని సునీల్ పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టబోతున్నామని దర్శకుడు శ్రీధర్ సీపాన తెలిపారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగామని, ఆయన నిర్మిస్తున్న చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని సుడిగాలి సుధీర్ అన్నారు. పి.ఆర్ సంగీతం అందిస్తూ పాటకు సాహిత్యాన్ని అందించారు.హారిక నారాయణ్, శ్రీకృష్ణ పాటను పాడారు.సుడిగాలి సుధీర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, దీపికా పిల్లి, నిత్యా శెట్టి, విష్ణు ప్రియ, వాసంతి తదితరులపై పాటను చిత్రీకరించారు. సునీల్, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, పుష్ప జగదీష్, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ, హేమ, షకలక శంకర్, తనికెళ్ల భరణి, ఆమని, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
టెలివిజన్ రంగంలో ఒక స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ నెంబర్ వన్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ అతి తక్కువ కాలంలోనే బుల్లితెరలో మంచి స్టార్ గా ఒక వెలుగు వెలిగాడు. అయితే ఇప్పుడు వెండి తెరపై కూడా అతను సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో అతను నటించిన సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు సుడిగాలి సుదీర్ తన ఆశలన్నీ కూడా వాంటెడ్ పండుగాడు అనే సినిమా పైన పెట్టుకున్నాడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమా లో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు. ఆగస్టు 19వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని సుధీర్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.
వాంటెడ్ పండుగాడ్ మూవీ రివ్యూ
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన తెరకెక్కించిన చిత్రం వాంటెడ్ పండుగాడ్.పట్టుకుంటే కోటి ట్యాగ్ లైన్. సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందగా, నేడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
పండు (సునీల్) అనే వ్యక్తి జైలు నుండి పారిపోయాక పోలీసులు బంపర్ ఆఫర్ ప్రకటిస్తారు. ఎవరైతే అతన్ని పట్టుకుంటారో వారికి కోటి రూపాయల రివార్డును ప్రకటిస్టారు, అయితే ఈ విషయం తెలుసుకున్న పాండు సు(సుధీర్) మరియు డీ(దీపికా పిల్లి) ఐన రిపోర్టర్లు మరియు కొంత మంది కలిసి పండు ని పట్టుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే చివరికి పండు ని ఎవరు పట్టుకున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
వాంటెడ్ పాండుగాడ్ టీవీ స్కిట్‌లకి ఎక్స్టెండెడ్ వెర్షన్ లాగా ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా ఒక సినిమా చూస్తున్నట్లుగా అనిపించదు, ఒక్క క్షణం కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేయదు మరియు స్కిట్‌లను ఇష్టపడే వారిని ఈ చిత్రం ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది, ఈ పాయింట్‌తో వెళితే మిమ్మల్ని నవ్వించే అంశాలు చాలా ఉన్నాయి. వాంటెడ్ పాండుగాడ్ చూస్తున్నప్పుడు ధమాల్ మరియు గోల్‌మాల్ వంటి కొన్ని బాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తుంది
నటీనటులు సునిల్ , అనసూయ, సుధీర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ మరియు హీరోయిన్లు విష్ణు ప్రియ మరియు దీపికా పిల్లి అందరూ తమ తమ పాత్రలతో తమ సత్తా చాటారు, మిగతా నటీనటులు బాగా చేసారు. శ్రీధర్ సీపాన స్వతహాగా రచయిత అయినప్పటికీ సినిమా అంతటా ప్రేక్షకులను కట్టిపడేయడంలో విఫలమయ్యాడు, పేలవమైన పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు మరియు మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమా అవసరాలకు అనుగుణంగా తమ సత్తా చాటారు.
చివరిగా.. వాంటెడ్ పండుగాడ్ చిత్రం స్కిట్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఇది రొటీన్ కామెడీ డ్రామాగా ఇది ప్రేక్షకులకి అనిపిస్తుంది. సుధీర్ ఖాతాలో మరోక ఫ్లాప్ చిత్రంగా దీనిని చెప్పవచ్చు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.