Asia Cup 2022 : ప్రస్తుతం ఏషియా కప్ ఊహించని విధంగా సాగుతుంది. పాకిస్తాన్ చివరి దశలో అద్భుతంగా రాణిస్తూ ఫైనల్ స్టేజ్‌కి వెళ్లింది. భారత్‌పై ఇటీవల జరిగిన మ్యాచ్‌లో అదృష్టవశాత్తు గెలిచిన రీసెంట్‌గా ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా చాలా కష్టంతో గెలిచింది. ఈ మ్యాచ్ మాత్రం క్రికెట్ ప్రేమికులకి మంచి థ్రిల్ కలిగించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ సహనం కోల్పోయాడు. పాకిస్థాన్ విజయానికి 8 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో ఆసిఫ్ అలీ 9వ వికెట్‌గా ఔటైపోయాడు. దాంతో అఫ్గానిస్థాన్ బౌలర్ పరీద్ అహ్మద్ సంబరాలు చేసుకోగా.. సహనం కోల్పోయిన ఆసిఫ్ అలీ అతడ్ని బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయానికి 9 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో పరీద్ అహ్మద్‌కి ఓ భారీ సిక్స్ కొట్టిన ఆసిఫ్ అలీ ఉత్కంఠ పెంచేశాడు. పాక్ అప్పటికే 8 వికెట్లని కోల్పోయినా.. ఆసిఫ్ అలీ క్రీజులో ఉండటంతో ఆ జట్టు గెలుపు ఖాయమనే అందరు భావించారు. కాని ఆ నెక్ట్స్ బాల్‌కి ఆసిఫ్ అలీకి పరీద్ బౌన్సర్‌ని సంధించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి థర్డ్ మ్యాన్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆసిఫ్ అలీ వికెట్‌తో మ్యాచ్‌ని గెలిచేసింతగా అప్గానిస్థాన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో పరీద్ అహ్మద్ కూడా నోరు జారాడు. దాంతో అఫ్గాన్ బౌలర్‌ని బ్యాట్‌తో కూడా కొట్టబోయాడు.
మరోవైపు.. పరీద్ కూడా వెనక్కి తగ్గలేదు. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో నసీమ్ షా తొలి రెండు బంతులకీ రెండు సిక్సర్లు కొట్టి పాక్‌ని గెలిపించాడు. దాంతో ఆసియా కప్ 2022 ఫైనల్ రేసు నుంచి అప్గాన్ నిష్క్రమించగా.. పాక్ దర్జాగా తుది పోరుకి చేరింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2022 లో భారత్ జట్టు ఈరోజు తన ఆఖరి మ్యాచ్‌ని ఆడబోతోంది. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకి భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆసియా కప్ 2022 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్లు ఈరోజు గెలిచినా.. ఓడినా ఇంటిబాట పట్టడం లాంఛనమే. కానీ.. అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ 2022 జరగనుండటంతో కనీసం విజయంతో టోర్నీని ముగించాలని భారత్ ఆశిస్తోంది.
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
This website uses cookies.