
ind vs ban 3rd odi match on Ishan Kishan creates 10 New Records
Ishan Kishan : టీ 20 వరల్డ్ కప్‌లో సెమీస్ లోనే బయటకు వచ్చిన టీమిండియా బంగ్లాతోను సిరీస్ కోల్పోయింది. దీంతోఇండియా టీంపై అనేక విమర్శలు వచ్చాయి.మూడో వన్డే తప్పక గెలవాల్సి ఉండగా, ఇషాన్ , విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ వలన భారత్ భారీ స్కోరు సాధించింది. రెండు పరాజయాలు చవిచూసిన టీమిండియా గాయపడిన సింహంలా ఎంతగానో గర్జించింది. చిట్టగాంగ్ స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీతో మైదానం సిక్స్‌లు, ఫోర్లతో మోత మొగింది ఈ ఇద్దరి భారీ భాగస్వామ్యంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల అత్యధిక స్కోర్ చేసి బంగ్లా ముందు బిత్తరపోయేంత టార్గెట్‌ను నిలిపింది. రోహిత్ గాయంతో మూడో వన్డేకు దూరం కావడంతో ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ స్థానం దక్కించుకున్నారు.
మొదట్టలో చాలా నెమ్మదిగా ఆడిన తర్వాత స్పీడ్ పెంచాడు. 85 బంతుల్లో శతకం చేశాడు. ఆ తర్వాత రెచ్చిపోయిన బ్యాటింగ్ చేశాడు. కేవలం 41 బంతుల్లో అంటే మొత్తంగా 126 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. అతడి ఊపు చూస్తే రోహిత్ శర్మ 264 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడేమోనని అందరు అనుకున్నారు. అయితే ఊహించని విధంగా 210 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ ఔటైపోయాడు. ఈ క్రమంలో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్ గా ఇషాన్ కిషన్ రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఇషాన్ కన్నా ముందు సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ మార్క్ అందుకున్నారు. అయితే . వన్డేల్లో మన జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కావడం విశేషం. అంతకు ముందు ధోనీ(183) పేరిట ఈ రికార్డు ఉంది.
ఇక బంగ్లాతో మూడో వన్డేలో 10 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్.. 2000లో సచిన్, బంగ్లాదేశ్ జట్టుపై 7 సిక్సులు బాదిన రికార్డుని తుడిచేశాడు. ఇక వన్డేల్లో తొలి సెంచరీని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా మార్చిన బ్యాటర్ గా కూడా ఇషాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు కపిల్ దేవ్.. తొలి సెంచరీని 175 పరుగులుగా చేసి నాటౌట్ గా నిలవగా, ఇషాన్ ఫాస్ట్ గా 150 ప్లస్ స్కోరు చేసిన భారత బ్యాటర్ గా ఘనత సాధించాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్.. 112 బంతుల్లో 150 ప్లస్ స్కోరు చేశాడు. బంగ్లాదేశ్ లో అతి చిన్న వయసులో 50 ప్లస్ స్కోరు చేసిన భారత క్రికెటర్ గా కూడా ఇషాన్ కిషన్ నిలిచాడు. టీమిండియా లెఫ్ట్ హ్యాండర్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మోత్తానికి ఒకే ఒక్క డబుల్ సెంచరీతో ఇషాన్ ఏకంగా 10 సరికొత్త రికార్డులు నెలకొల్పడం భారత అభిమానులు ని సంతోషపరుస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.