Home » News » India Semi Final Chances Have Become Complicated
News

Ind Vs Zim T20 World Cup 2026 : అలా జరిగితే .. నెట్‌రన్‌రేటుతో భారత్‌కు సంబంధం ఉండదా ?.. భారత్ సెమీస్‌కు చేరుకోవచ్చా ?

Authored By
Suma
The Telugu News | Updated on: February 26, 2026 12:48 pm
Advertisement

Ind Vs Zim T20 World Cup 2026  : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో గురువారం రెండు కీలక పోరులు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. చెన్నైలోని ఎం. ఎ. చిదంబరం స్టేడియం వేదికగా భారత్ జట్టు జింబాబ్వేతో తలపడనుండగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం లో దక్షిణాఫ్రికా–వెస్టిండీస్ జట్లు ముఖాముఖి కానున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలు గ్రూప్-1 నుంచి సెమీఫైనల్‌కు వెళ్లే జట్లను నిర్ణయించడంలో కీలకంగా మారనున్నాయి. భారత్ ఇప్పటికే సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమిని చవిచూసింది. దీంతో నెట్ రన్‌రేట్ (-3.800) తీవ్రంగా పడిపోయింది. మరోవైపు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై భారీ విజయంతో (+5.350) అద్భుతమైన నెట్ రన్‌రేట్ సాధించింది. ప్రస్తుతం పాయింట్లు సమంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా వెస్టిండీస్ గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉంది.

Advertisement

T20 World Cup 2026 : అలా జరిగితే .. నెట్‌రన్‌రేటుతో భారత్‌కు సంబంధం ఉండదా ?.. భారత్ సెమీస్‌కు చేరుకోవచ్చా ?

T20 World Cup 2026 : భారత్–జింబాబ్వే పోరు : గెలుపే లక్ష్యం

చెపాక్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు ‘డూ ఆర్ డై’ పరిస్థితి అని చెప్పాలి. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే జింబాబ్వేపై గెలవడం తప్ప మరో మార్గం లేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. కేవలం గెలవడమే కాదు, భారీ తేడాతో విజయం సాధించడం కూడా భారత్‌కు కీలకమవుతుంది. ఎందుకంటే చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు నెట్ రన్‌రేట్ కొంత మెరుగుపడాలి. అయితే భారత అభిమానుల చూపంతా ముందుగా జరగబోయే దక్షిణాఫ్రికా–వెస్టిండీస్ మ్యాచ్‌పైనే ఉంది.

Advertisement

T20 World Cup 2026 : దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు లాభం

దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్తే సమీకరణాలు భారత్‌కు అనుకూలంగా మారతాయి. ఆ పరిస్థితిలో దక్షిణాఫ్రికా ఖాతాలో నాలుగు పాయింట్లు చేరతాయి. భారత్ జింబాబ్వేపై గెలిస్తే రెండు పాయింట్లతో వెస్టిండీస్‌తో సమానంగా నిలుస్తుంది. అప్పుడు భారత్–వెస్టిండీస్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ నేరుగా సెమీస్‌కు వెళ్లే జట్టును నిర్ణయించే పోరుగా మారుతుంది. ఇక దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆడనుంది. ఆ మ్యాచ్ ఫలితం సెమీస్ అవకాశాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఒకవేళ సఫారీ జట్టు ఆ మ్యాచ్‌లో ఓడినా నాలుగు పాయింట్లతో ముందంజలో ఉండే అవకాశముంది.

T20 World Cup 2026 : వెస్టిండీస్ గెలిస్తే కఠిన పరిస్థితి

అయితే వెస్టిండీస్ దక్షిణాఫ్రికాపై గెలిస్తే భారత్‌కు పరిస్థితి క్లిష్టమవుతుంది. ఆ సందర్భంలో భారత్ కేవలం జింబాబ్వేపై గెలవడమే కాకుండా, చివరి మ్యాచ్‌లో కూడా భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించనుంది. ఈ రోజు జరిగే రెండు మ్యాచ్‌లు సూపర్-8 దశలో కీలక మలుపుగా మారనున్నాయి. భారత్ అభిమానులు దక్షిణాఫ్రికా విజయాన్ని ఆశిస్తూ తమ జట్టు ఘన విజయం సాధించాలని ఎదురుచూస్తున్నారు. సెమీస్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి