Jadeja : రిటైర్మెంట్ వయస్సులో దూకుడుగా ఆడుతున్న జడేజా.. అద్వితీయం అంటున్న నెటిజన్స్.!
Jadeja : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. తొలి నాలుగు రోజుల ఆటలో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ చివరి రోజు మాత్రం వీరోచితంగా పోరాడింది. అయితే ఈ మ్యాచ్ డ్రా కావడంలో గిల్, రాహుల్, సుందర్ పాత్ర తప్పక ఉంటుంది. కాని ఒక ప్లేయర్ రిటైర్మెంట్ ఏజ్‌లో రెచ్చిపోతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఆ ఆటగాడు మాత్రం నిజమైన టీమిండియా ‘OG’ అనిపించుకుంటున్నాడు.
Jadeja : రిటైర్మెంట్ వయస్సులో దూకుడుగా ఆడుతున్న జడేజా.. అద్వితీయం అంటున్న నెటిజన్స్.!
ప్రస్తుతం రవీంద్ర జడేజా వయసు 36 ఏళ్లు. క్రికెట్‌లో 36 ఏళ్లంటే రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డట్లే అని అర్థం.ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే జడేజా తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో రవీంద్ర జడేజా దంచి కొడుతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రెచ్చిపోతున్నాడు. నాలుగో టెస్టు డ్రాగా ముగియడానికి రవీంద్ర జడేజా కూడా ఒక కారణం.
107 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఒక సెంచరీ.. 4 అర్ధ సెంచరీలు చేశాడు. నాలుగు టెస్టుల్లోనూ రెండో ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచాడు. తొలి నాలుగు టెస్టుల్లో 454 పరుగులు చేశాడు. సగటు 113.5. 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ ఇన్ని పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక బౌలింగ్‌లోనూ జడేజా ఫర్వాలేదనిపిస్తున్నాడు. స్పిన్‌కు ఏ మాత్రం సహకారం లభించని చోట 7 వికెట్లు సాధించాడు. ఆల్‌రౌండర్ అనగానే అందరూ ఫ్లింటాఫ్, స్టోక్స్ గురించే చెబుతారు కానీ.. మన జడేజా వాళ్ల కంటే తోపేనని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
Nivita Manoj : hari hara veera mallu నాలుగు రోజుల క్రితం వరకూ నివేతా పేరు ప్రేక్షకులకు పెద్దగా…
Wife : “పెళ్లికి ముందే ఓసారి ప్రశ్నించండి.. నా తప్పును మీరు చేయోద్దు” అంటూ ఓ యువకుడు మీడియా ముందు…
Unemployed : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస తీపి కబుర్లు అందజేస్తూ…
Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం…
Rakul Preet Singh Tamanna : ఈ మధ్య అందాల భామల గ్లామర్ షో కుర్రాళ్లకి కంటిపై కునుకు రానివ్వడం…
Nitish Kumar Reddy : సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను నితీష్ కుమార్ రెడ్డి వీడుతున్నట్లు జరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ ప్రచారంపై…
Film Piracy : సినిమా పైరసీని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైరసీ మార్గంగా సినిమా చిత్రాలను…
Vellampalli Srinivas " అధికారం చేపట్టిన కూటమి సర్కార్ "సంపద సృష్టి" అనే పేరుతో సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ఆర్థిక…
This website uses cookies.