Jadeja : రిటైర్మెంట్ వ‌య‌స్సులో దూకుడుగా ఆడుతున్న జ‌డేజా.. అద్వితీయం అంటున్న నెటిజ‌న్స్.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jadeja : రిటైర్మెంట్ వ‌య‌స్సులో దూకుడుగా ఆడుతున్న జ‌డేజా.. అద్వితీయం అంటున్న నెటిజ‌న్స్.!

 Authored By ramu | The Telugu News | Updated on :28 July 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Jadeja : రిటైర్మెంట్ వ‌య‌స్సులో దూకుడుగా ఆడుతున్న జ‌డేజా.. అద్వితీయం అంటున్న నెటిజ‌న్స్.!

Jadeja : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. తొలి నాలుగు రోజుల ఆటలో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ చివరి రోజు మాత్రం వీరోచితంగా పోరాడింది. అయితే ఈ మ్యాచ్ డ్రా కావ‌డంలో గిల్, రాహుల్, సుంద‌ర్ పాత్ర త‌ప్ప‌క ఉంటుంది. కాని ఒక ప్లేయర్ రిటైర్మెంట్ ఏజ్‌లో రెచ్చిపోతుండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.ఆ ఆట‌గాడు మాత్రం నిజమైన టీమిండియా ‘OG’ అనిపించుకుంటున్నాడు.

Jadeja రిటైర్మెంట్ వ‌య‌స్సులో దూకుడుగా ఆడుతున్న జ‌డేజా అద్వితీయం అంటున్న నెటిజ‌న్స్

Jadeja : రిటైర్మెంట్ వ‌య‌స్సులో దూకుడుగా ఆడుతున్న జ‌డేజా.. అద్వితీయం అంటున్న నెటిజ‌న్స్.!

Jadeja : అద‌ర‌గొట్టేస్తున్నాడు…

ప్రస్తుతం రవీంద్ర జడేజా వయసు 36 ఏళ్లు. క్రికెట్‌లో 36 ఏళ్లంటే రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డట్లే అని అర్థం.ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే జడేజా తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో రవీంద్ర జడేజా దంచి కొడుతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రెచ్చిపోతున్నాడు. నాలుగో టెస్టు డ్రాగా ముగియడానికి రవీంద్ర జడేజా కూడా ఒక కారణం.

107 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఒక సెంచరీ.. 4 అర్ధ సెంచరీలు చేశాడు. నాలుగు టెస్టుల్లోనూ రెండో ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచాడు. తొలి నాలుగు టెస్టుల్లో 454 పరుగులు చేశాడు. సగటు 113.5. 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ ఇన్ని పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక బౌలింగ్‌లోనూ జడేజా ఫర్వాలేదనిపిస్తున్నాడు. స్పిన్‌కు ఏ మాత్రం సహకారం లభించని చోట 7 వికెట్లు సాధించాడు. ఆల్‌రౌండర్‌ అనగానే అందరూ ఫ్లింటాఫ్‌, స్టోక్స్‌ గురించే చెబుతారు కానీ.. మన జడేజా వాళ్ల కంటే తోపేనని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది