KL Rahul and Athiya Shetty properties value
KL Rahul : ఇండియన్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇటీవల ఓ ఇంటివాడు అయ్యాడు. బాలీవుడ్ బ్యూటీ అథియ శెట్టి ని జనవరి 23, 2023 న గ్రాండ్గా వివాహం చేసుకున్నాడు. వివాహనంతరం అతియ, కెల్ రాహుల్ పెళ్లికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను షేర్ చేశారు. అవి అభిమానుల్లో వైరల్ గా మారాయి. అథియా శెట్టి బాలీవుడ్ లో తన తదుపరి కెరీర్ ని కొనసాగించనుంది. ఈమె ఇప్పటివరకూ కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేసింది. కేల్ రాహుల్ వైస్ కెప్టెన్ కావడంతో బిజీ షెడ్యూళ్ల కారణంగా హనీమూన్ ని మిస్ చేసుకున్నారు. తమ వివాహ వేడుకలను కొద్దిమంది బంధుమిత్రులు సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా చేసుకున్నారు.
ఇప్పుడు ఈ కొత్త జంట ఆస్తుల వివరాల గురించి వెబ్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు. అతియా శెట్టి ఒక్కో సినిమాకు మూడు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక కేఎల్ రాహుల్ బీసీసీఐఎల్, ఐపీఎల్ ద్వారా భారీగానే పుచ్చుకున్నాడు. రాహుల్ ఏడాదికి బీసీసీఐ నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటారు. ఐపీఎల్ ఆడటం ద్వారా 17-20 కోట్ల వరకు సంపాదించాడు. కెఎల్ రాహుల్ నికర ఆస్తుల విలువ దాదాపు 80-90 కోట్లుగా ఉంటుందని అంచనా.అథియా శెట్టి నికర ఆస్తులవిలువ 28-30 కోట్లుగా ఉంది. ఈ జంట మొత్తం నికర విలువ దాదాపు రూ. 100 – 120 కోట్లు ఉంటుందని సమాచారం. అథియా శెట్టి – KL రాహుల్ జంట ఆస్తులతో పాటు
KL Rahul and Athiya Shetty properties value
వారికి ఉన్న లగ్జరీ వస్తువులు, కార్లు వగైరా వివరాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఆథియా ఖరీదైన బ్రాండెడ్ కార్లను కలిగి ఉంది. ఆడి Q7 SUV- మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ లగ్జరీ సెడాన్ – ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లను కలిగి ఉంది. మరోవైపు రాహుల్ BMW X7 – మెర్సిడెస్-AMG C43 ప్రీమియం సెడాన్ ని కొనుగోలు చేశాడు. కేఎల్ రాహుల్ బెంగళూరులోని ఓ ఇంటితోపాటు గోవాలో కూడా ఆస్తిని కలిగి ఉన్నట్లు సమాచారం.రాహుల్ గోవాలో కూడా ఆస్తిని కలిగి ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి ముంబై- బాంద్రాలో కూడా ఒక అపార్ట్ మెంట్ ను కొనుక్కున్నారు. దీంతో పాటు ఈ జంట ఖరీదైన వాచీలు- డైమండ్ సెట్లు -బ్యాగ్ లను కలిగి ఉన్నారు. వీటన్నిటి విలువ కోట్లలో ఉంటుంది. మొత్తానికి కొత్త జంట ఆస్తుల విలువ 100 కోట్లు పైనే ఉంటుందని తేలింది.
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
This website uses cookies.