Lionel Messi : ప్రపంచంలో అత్యధికంగా క్రేజ్ ఉన్న ఆటలలో ఫుల్ బాల్ ఒకటి. గత కొద్ది రోజులుగా ఎంతో రసవత్తరంగా సాగిన ఫుల్ బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆదివారం ముగిసింది. ప్రపంచ కప్ 2022 ఫైనల్‌లో అర్జెంటీనా జట్టును విశ్వవిజేతగా నిలిపాడు లియోనెల్ మెస్సీ. ఈ ఈవెంట్ తర్వాత మెస్సీ స్థాయి మారడోనాతో సమానంగా మారింది. ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య చర్చ నడిచిన ఆయన గురించే. . అర్జెంటీనా సారధిగా ఫిఫా వరల్డ్ కప్ 2022ను గెలిపించిన మెస్సీ.. అనంతరం టోర్నీలో అత్యుత్తమ ప్లేయర్‌కు అందించే గోల్డెన్ బాల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. మొత్తం ఏడు గోల్స్ నమోదు చేయడంతోపాటు
రెండు కీలకమైనఅసిస్ట్‌లు కూడా అందించి వావ్ అనిపించాడు. చరిత్ర సృష్టించాడు.. మెస్సీ సంపాదన గురించి ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. అతను ప్రతి గంటకు $8,790 అంటే రూ. 7.25 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది.. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అతను ఈ ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తోన్న అథ్లెట్‌గా ఉన్నాడు.. నవంబర్ 2022 నాటికి.. లియోనెల్ మెస్సీ నికర విలువ 600 మిలియన్ డాలర్లు అనగా, 4 వేల 952 కోట్ల రూపాయలు అన్నమాట. అతను ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్లలో ఒకడు కాగా, ఆయన కేవలం క్రీడలతో పాటు..
అతను అనేక బ్రాండ్ల ప్రచారం ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, మే 2021 నుండి మే 2022 వరకు మెస్సీ ఆన్ మరియు ఆఫ్ ఫీల్డ్ సంపాదన $130 మిలియన్లు అని చెబుతున్నారు. ఇందులో అతను ఫీల్డ్‌లో 75 మిలియన్ డాలర్లు సంపాదించగా, ఆఫ్ ఫీల్డ్‌లో 55 మిలియన్ డాలర్లు సంపాదించాడు. మెస్సీ రోజువారీ సంపాదన 1 లక్షా 5 వేల డాలర్లు అని టాక్. బార్సిలోనాలో మెస్సీకి నో ఫ్లై జోన్ బంగ్లాతో పాటు హోట్ ఉంది. మెస్సీ బంగ్లాలోప్రత్యేకమైన ప్రైవేట్ ఫుట్‌బాల్ మైదానం ఉంది. అతనికి ఒక లగ్జరీ హోటల్ కూడా ఉంది. స్పెయిన్‌లోని ఇబిజా ద్వీపంలో మెస్సీ తన సెలవులను గడిపేందుకు అందమైన బంగ్లాని కూడా నిర్మించుకున్నాడు.
మెర్సీకి చాలా హైస్పీడ్ కార్లు ఉండగా, అందులో రెండు మిలియన్ డాలర్ల పగని జోండా ట్రైకలర్, మస్సెరాటి గ్రాన్‌టురిస్మో, ఫెరారీ ఎఫ్430 స్పైడర్, డాడ్జ్ ఛార్జర్ ఎస్‌ఆర్‌టి8, ఆడి-రేంజ్ రోవర్ కార్లు కూడా ఉన్నాయి. వంద కోట్ల ప్రైవేట్ జెట్ ఉండగా, ఇందులో రెండు బాత్‌రూమ్‌లు, వంటగది మరియు 16 మందికి పైగా సీటింగ్ ఉన్నాయి. 2006లో ఫుట్‌బాల్ కెరీర్ ఆరంభించిన మెస్సీకి వరల్డ్ కప్ నెగ్గడమే జీవితాశయం కాగా, 2014లో దాని అంచుల వరకు వెళ్లిన కూడా తన ఆశ నెరవేరలేదు. ఎట్టకేలకు 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి ఫుట్‌బాల్ ప్రపంచానికి రారాజుగా పట్టాభిషేకం పొందాడు. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి.. 15 అంగుళాల బంగారు కప్పును తన చేతిలో తీసుకొని ముద్దాడాడు..
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్…
This website uses cookies.