
Jabardasth Nookaraju going out from mallemala and etv
Jabardasth Nookaraju : జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కీలక కమెడియన్ గా వ్యవహరిస్తున్న నూకరాజు అతి త్వరలోనే మల్లెమాల వారికి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జబర్దస్త్ లో ఇన్నాళ్లుగా చేస్తున్నప్పటికీ టీం లీడర్ పదవి ఇవ్వక పోవడంతో నూకరాజు అసంతృప్తి తో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే నూకరాజు పక్క ఛానల్ కి వెళ్ళిపోతాడు అంటూ స్వయంగా ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తుండడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ లో నూకరాజుకు ప్రాముఖ్యత బానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదట.
అంతే కాకుండా జబర్దస్త్ కొత్త టీం లీడర్స్ వచ్చిన ఈ సమయంలో తనకు ఒక టీం ఇవ్వాల్సింది అంటూ నూకరాజు కోరుకున్నాడట. కానీ నూకరాజు టీం లీడర్ గా వ్యవహరించేందుకు మల్లెమాల వారు ఓకే చెప్పలేదు. అందుకే నూకరాజు ప్రస్తుతం ఛానల్ మారే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. స్టార్ మా లో కామెడీ స్టార్ట్స్ కోసం గతంలో వెళ్లిన కమెడియన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అంతా చూస్తున్నారు. అందుకే నూకరాజు ఇన్నాళ్లు వెయిట్ చేశాడని.. ఇంకా వెయిట్ చేయాలని అనుకోవడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆహా ఓటీటీ వారి నుండి నూకరాజుకి ఇన్విటేషన్ వచ్చిందట కానీ ఆ సమయం లో నూకరాజు నో చెప్పాడని తెలుస్తుంది.ఇప్పుడు నూకరాజు ఓకే చెప్తే వెళ్తాడా లేదా అనేది చూడాలి.
Jabardasth Nookaraju going out from mallemala and etv
చాలా మంది కమెడియన్స్ తరహాలో నూకరాజు మల్లెమాల వారితో అగ్రిమెంట్ లో లేడట. అందుకే ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఛానల్ మారే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఈటీవీ మల్లెమాల వారి యొక్క ప్రవర్తన కారణంగా జబర్దస్త్ నుండి ఇప్పటికే చాలా మంది కమెడియన్ వెళ్ళి పోయారు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి కూడా చాలా మంది వెళ్లి పోతున్నారు. ఇకపై అయినా జాగ్రత్తగా ఉంటే ఆ రెండు షో లను మల్లెమాల ఈటివి వారు కాపాడుకోవచ్చు.. లేదంటే నూకరాజు మాదిరిగా ఎంతో మంది బయటకు వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.