Home » News » Netizens Fire On Players After T20 World Cup 2026 Win
News

T20 World Cup 2026 : కప్ గెలుపు అనంతరం ఆటగాళ్లు చేసిన పని పట్ల నెటిజన్లు ఆగ్రహం..!

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Published on: March 11, 2026, 2:00 pm
Advertisement

T20 World Cup 2026 : 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించి, సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్‌ను నిలబెట్టుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, భారత్ తన మూడో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, మైదానంలో ఆటగాళ్లు ప్రదర్శించిన అద్భుత ఆటతీరు కంటే, మ్యాచ్ అనంతరం వారు తమ భాగస్వాములతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెను వివాదానికి దారితీసింది. కుటుంబ సభ్యులను మైదానంలోకి అనుమతించిన వేళ, సంబరాల పేరిట కొందరు ఆటగాళ్లు హద్దులు దాటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

T20 World Cup 2026 : కప్ గెలుపు అనంతరం ఆటగాళ్లు చేసిన పని పట్ల నెటిజన్లు ఆగ్రహం..!

T20 World Cup 2026 : కప్ గెలుపు అనంతరం ఆటగాళ్లు చేసిన పని పట్ల నెటిజన్లు ఆగ్రహం

ముఖ్యంగా రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోదీలు వేల సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్యే తమ సతీమణులకు ‘లిప్ టు లిప్ కిస్’ ఇస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఓటమి బాధలో ఉన్న తమ భర్తలను ఓదార్చే క్రమంలో వారు ఇలా ప్రవర్తించారని కొందరు అంటున్నా, బహిరంగ ప్రదేశంలో కనీస సోయి లేకుండా ప్రవర్తించారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది కేవలం న్యూజిలాండ్ ప్లేయర్లకే పరిమితం కాకుండా, భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. హార్దిక్ తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి ట్రోఫీని పట్టుకుని అతిగా రొమాన్స్ చేయడం, పోడియంపై పడుకుని ముద్దులతో ముంచెత్తడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

T20 World Cup 2026 : ఛీ..అందరు చూస్తుండగా ఇలా ముద్దులు పెట్టుకోవడం ఏంటి..? ఆటగాళ్ల తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం

హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత మహికా శర్మతో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మైదానంలో వీరి ప్రవర్తనను చూసిన క్రికెట్ అభిమానులు “ఇవి గెలుపు సంబరాలా లేక ముద్దుల పోటీలా?” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఆటగాళ్లకు ఉండాల్సిన కనీస కామన్ సెన్స్ ఎక్కడికి పోయిందని, కుటుంబాలతో కలిసి మ్యాచ్‌లు చూసే చిన్నపిల్లలపై ఇలాంటి చర్యల ప్రభావం ఎలా ఉంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితం ఏదైనప్పటికీ, క్రీడా మైదానం వంటి బహిరంగ వేదికలపై హుందాతనంగా వ్యవహరించాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి