Home » News » Pakistan Bowler Shaheen Afridi Hits Afif Hossain Video
News

pakistan : త‌న బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడ‌ని.. బ్యాట్స్‌మెన్‌ను గాయ‌ప‌రిచిన పాక్ బౌల‌ర్‌.. వీడియో..!

Authored By
aruna
The Telugu News | Published on: November 20, 2021, 9:20 pm
Advertisement

pakistan : పాకిస్థాన్ బౌల‌ర్ షాహీన్ మ‌రో సారి వార్త‌ల్లో నిలిచాడు. షాహీన్ ఆఫ్రిది మైదానంలో కాకుండా బ‌య‌ట కూడా వింత ప్ర‌వ‌ర్త‌న‌తో సోష‌ల్ మీడియాలో ట్రోల్ కి గుర‌వుతుంటాడు. బంగ్లాదేశ్‌లో జ‌రుగుతున్న‌రెండో టీ 20 మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిది బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ను కొట్టాడు. క్రీజులో నిల‌బ‌డి ఉన్న అఫీఫ్ హుస్సేన్ వైపు షాహీన్ విసిరిన త్రో అత‌ని కాలికి త‌గిలింది. ఆ దెబ్బ‌కు బ్యాట్స్‌మెన్ కింద‌ప‌డిపోయాడు. బ్యాట్స్‌మెన్ ఆనొప్పి తో బాధ‌ప‌డ‌టం వీడియోలో చూడోచ్చు.

Advertisement

షాహీన్ కావాల‌నే ఈ ప‌ని చేయడంతో వివాదాల‌కు దారి తీస్తోంది. త‌ను వేసిన ముడో ఓవ‌ర్ , రెండోవ బంతికి ఆఫీఫ్ నేరుగా సిక్స్ కొట్టాడు. ఆ కోపంతో త‌ర్వాత ఓవ‌ర్‌లో చూపించాడు షాహీన్‌. బౌలింగ్ వేసిన షాహీన్ బ్యాట్స్‌మెన్ వైపు త్రో రూపంలో గ‌ట్టిగా విసిరాడు. ఆ బంది అఫిఫ్ పాదాల‌కు బ‌లంగా తాకింది.

pakistan bowler shaheen afridi hits afif hossain Video

Advertisement

అఫీఫ్ గాయ‌ప‌డిన వెంట‌నే త‌న వ‌ద్ద‌కు వెళ్లి అత‌నిని పైకి లేపాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా అఫీఫ్ క్ష‌మాప‌ణ చెప్పారు. అయితే అత‌నికి పెద్ద‌గా గాయం కాలేదు కానీ కుంటుతూ న‌డిచాడు. షాహీన్ అఫ్రిది ఈ చర్య క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో షాహీన్ ఆఫ్రిది మ్యాచ్ ఫీజును తగ్గించాలని, ఒక మ్యాచ్‌ నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి