Home » News » Pakistani Cricket Fans Trolling On Virat Kohli
News

Virat Kohli : విరాట్ కోహ్లీ పై నోరు పారేసుకున్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: September 3, 2023 8:03 pm
Advertisement

Virat Kohli : ఆసియా కప్ టోర్నీలో శనివారం శ్రీలంకలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 48.5 ఓవర్లకు ఆల్ అవుట్ అయ్యి 266 పరుగులు చేయడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ రెండో బ్యాటింగ్ కి దిగాల్సిన సమయంలో జోరుగా వర్షం పడటంతో.. ఎక్కడ తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇరుజట్లకు చెరో పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంలో కింగ్ కోహ్లీ భయపడ్డాడు అని పాక్ అభిమానులు.. భయంకరంగా ట్రోల్ చేయడం జరిగింది.

Advertisement

దీనికి కారణం విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒకే ఒక్క రియాక్షన్. పాకిస్తాన్ తో మ్యాచ్ ప్రారంభంలోనే బ్యాటింగ్ కి దిగిన భారత్ కీలక బ్యాట్స్ మ్యాన్ లు వరుసగా అవుట్ అయిపోయారు. చాలా వరకు సింగిల్ ఫిగర్ తోనే స్టార్ ఫియర్ వెనక్కి జరగటం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. స్టార్టింగ్ లోనే ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తర్వాత విరాట్ కోహ్లీనీ పాకిస్తాన్ స్పీడ్ స్టార్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది అవుట్ చేయడం జరిగింది. షాహిన్ వేసిన బంతులకు.. భారత్ బ్యాటర్లు తడబడి పోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 11 పరుగులు సాధించగా విరాట్ కోహ్లీ ఒకే ఒక్క పరుగు చేసి పెబిలియన్ చేరుకున్నాడు.

Virat Kohli : విరాట్ కోహ్లీ పై నోరు పారేసుకున్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు..!!

Advertisement

ఈ నేపథ్యంలో షాహిన్ వేసిన ఓ బాల్.. రోహిత్ శర్మ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో అధర్ ఎండ్ లో ఉన్న కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింగ్ కోహ్లీ భయపడ్డాడు అంటూ ఆ ఫోటోని మరియు వీడియోని ట్యాగ్ చేసి పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పాకిస్తాన్ బౌలర్లు.. భారత్ బ్యాట్స్ మ్యాన్ లు బెంబేలెత్తి ఇచ్చారు అని కామెంట్లు చేస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి