Chandrababu : కోర్టు + వైసీపీ విషయం లో చంద్రబాబు అనుకున్నదే జరిగింది ..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 27 August 2026, 11:50 pm
  •  Chandrababu ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊహించినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తున్న

Chandrababu  : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊహించినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. వైసీపీ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియతో పాటు కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధుల అంశం కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అక్టోబర్‌లోగా ఎన్నికలు పూర్తి చేస్తే కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రంలోని పంచాయతీలు, నగర పాలక సంస్థలకు అందేలా చేయవచ్చని ప్రభుత్వం లెక్కలు వేసుకున్నట్లు సమాచారం. సుమారు రూ.12 వేల కోట్ల మేర నిధులు అందే అవకాశం ఉందని అంచనా. ఈ నిధులతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Chandrababu : కోర్టు + వైసీపీ విషయం లో చంద్రబాబు అనుకున్నదే జరిగింది ..!

Chandrababu : కోర్టు + వైసీపీ విషయం లో చంద్రబాబు అనుకున్నదే జరిగింది ..!

Chandrababu  వైసీపీ హైకోర్టును ఆశ్రయించడంతో మళ్లీ వేడెక్కిన రాజకీయం

అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు, కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధులకు వైసీపీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని చంద్రబాబు గతంలోనే అంచనా వేసినట్లు కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని ఆయన మంత్రులతో జరిగిన చర్చల్లో కూడా ప్రస్తావించినట్లు సమాచారం. “వైసీపీ అడ్డుపడే అవకాశం ఉంది. దీనిపై మనం ఆలోచన చేయాలి. కోర్టుకు వెళ్తారో.. లేక కేంద్రం వద్ద అడ్డు పెడతారో చూడాలి” అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. ఇప్పుడు దాదాపు అదే తరహాలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని తీసుకుని హైకోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 3వ తేదీకి ముందే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తోందని పేర్కొంటూ.. ఆ ప్రక్రియను అడ్డుకోవాలని వైసీపీ కోర్టును కోరింది. ఇందుకోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వైసీపీ ప్రధాన అంశంగా ప్రస్తావించింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియ పూర్తయిందని, ఈ క్రమంలో 40 లక్షల మందికి పైగా ఓట్లు తొలగించారని వైసీపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌లో ప్రకటించనున్నారని తెలిపింది.తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Chandrababu  ఓటర్ల జాబితాపై వైసీపీ అభ్యంతరం.. ఎన్నికల సంఘం ఏమంటోంది?

అయితే వైసీపీ చేస్తున్న ఆరోపణలకు భిన్నంగా ఎన్నికల సంఘం మరో విధంగా స్పందిస్తున్నట్లు కథనంలో పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులైన ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ విధానం అన్ని రాజకీయ పార్టీలకు, వైసీపీకి కూడా ప్రయోజనం కలిగించేలా ఉంటుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడుతున్నట్లు కథనం పేర్కొంది. అయితే ఈ విషయంలో వైసీపీ వ్యూహం మరోలా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.12 వేల కోట్ల నిధులు రద్దయ్యే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.కేంద్ర నిధులు నిలిచిపోవడం ద్వారా ప్రభుత్వం ఇరుకున పడేలా చేయడమే వైసీపీ వ్యూహమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేసేందుకు కోర్టును ఆశ్రయించిందని వారు విమర్శిస్తున్నారు.మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? SIR అనంతరం తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్న వైసీపీ వాదనపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అక్టోబర్‌లోగా ఎన్నికలు పూర్తవుతాయా? కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.12 వేల కోట్ల నిధుల విషయంలో ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుంది? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ వివాదంపై కోర్టు విచారణలో ఎలాంటి దిశానిర్దేశాలు వస్తాయో వేచి చూడాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp