Home » News » Suryakumar Yadav Reacts On Pakistan Match In T20 World Cup 2026
News

Suryakumar Yadav : Breaking News.. పాకిస్థాన్ మాతో ఆడాలంటే భ‌య‌ప‌డుతుంది.. సూర్య‌కుమార్ సంచ‌ల‌న కామెంట్స్‌…!

Authored By
Suma
The Telugu News | Published on: February 5, 2026, 7:40 pm
Advertisement

Suryakumar Yadav :  టీ20 వరల్డ్ కప్ 2026  T20 World Cup 2026 ప్రారంభానికి ముందే India భారత్,  పాకిస్థాన్ Pakistan జట్ల మధ్య మరోసారి రాజకీయ నీడలతో కూడిన వివాదం తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్–పాక్ మ్యాచ్‌ను తాము ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇప్పటికే ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం మేరకు తటస్థ వేదికగా శ్రీలంకను ఎంపిక చేశారు. అయినా చివరి నిమిషంలో పాక్ వెనక్కి తగ్గడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయానికి కారణంగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చడంపై పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించడం క్రికెట్‌కంటే రాజకీయాలే పైచేయి సాధించాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Suryakumar Yadav : Breaking News.. పాకిస్థాన్ మాతో ఆడాలంటే భ‌య‌ప‌డుతుంది.. సూర్య‌కుమార్ సంచ‌ల‌న కామెంట్స్‌…!

Suryakumar Yadav :  సూర్యకుమార్ యాదవ్ స్పష్టత: ‘మేం సిద్ధమే’

ఈ వివాదంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా స్పందించారు. ముంబైలో జరిగిన కెప్టెన్ల ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్ వైపు నుంచి ఎలాంటి నిరాకరణ లేదని తేల్చిచెప్పారు. “మా వైఖరి మొదటి నుంచీ స్పష్టం. మ్యాచ్ ఆడకూడదని మేం ఎప్పుడూ అనలేదు. షెడ్యూల్ ప్రకారం మేం కొలంబోకు వెళ్తున్నాం. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ అయ్యాయి” అని సూర్య ధీమాగా చెప్పారు. ఫిబ్రవరి 15న మైదానంలోకి దిగాలా వద్దా అన్నది పూర్తిగా పాకిస్థాన్ నిర్ణయమేనని, భారత్ మాత్రం మ్యాచ్‌కు పూర్తి సన్నద్ధతతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత జట్టు క్రికెట్ స్పిరిట్‌కు కట్టుబడి ఉందన్న సందేశం స్పష్టంగా వెళ్లింది.

Advertisement

Suryakumar Yadav :  ఐసీసీ ఆగ్రహం, పీసీబీకి భారీ నష్టాల ముప్పు

కేవలం భారత్‌తో మ్యాచ్ మాత్రమే ఆడబోమన్న పాకిస్థాన్ వైఖరిపై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సెలెక్టివ్ పార్టిసిపేషన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని హెచ్చరిస్తూ దీని వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించింది. జరిమానాల నుంచి తప్పించుకునేందుకు పీసీబీ ‘ఫోర్స్ మెజూర్’ క్లాజ్‌ను ప్రస్తావిస్తూ ప్రభుత్వ ఆదేశాల వల్ల తాము ఒప్పందాన్ని పాటించలేకపోతున్నామని వాదించే ప్రయత్నం చేస్తోంది. అయితే బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు ఇది అనివార్య పరిస్థితి కాదని పూర్తిగా రాజకీయ కారణమేనని ఖండిస్తున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్‌కు రాకపోతే భారత్‌కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి. కానీ అసలు ప్రమాదం పాక్ బోర్డుకే. ఐసీసీ నుంచి ఏడాదికి వచ్చే సుమారు 35–38 మిలియన్ డాలర్ల ఆదాయం నిలిచిపోయే అవకాశం ఉంది. అంతేకాదు బ్రాడ్‌కాస్టర్లు కూడా నష్టపరిహారం కోసం న్యాయపోరాటానికి వెళ్లవచ్చని సమాచారం. ఇప్పటికే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా పీసీబీతో చర్చలు జరుపుతున్నారు. మరి ఫిబ్రవరి 15 నాటికి పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేక ఈ వివాదం మరింత ముదురుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి