Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్.. చిట్టి లయన్ డేంజరే..!
Vaibhav Suryavanshi : లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసు (14 ఏళ్ల 23 రోజులు)లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతను తొలి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలుచుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్‌గా మలిచి అభిమానులని అలరించాడు. శార్దూల్ వేసిన బంతిని కవర్స్ మీదుగా బాది అద్భుతమైన సిక్సుగా మలవడంతో సిక్సర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు.
Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్.. చిట్టి లయన్ డేంజరే..!
ఆ తర్వాత మూడో బంతిని కూడా సిక్స్ బాది అదరగొట్టాడు. ఈ మ్యాచులో వైభవ్ సూర్యవంశీ పైకి కామ్ గా కనపడుతూనే ఎంతో ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. తన బ్యాటును ఝళిపించి.. ప్రతీ బంతిని బలంగా బాదాడు. 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మార్ క్రమ్ బౌలింగ్ లో 8.4 ఓవర్ వద్ద వికెట్ కీపర్ రిషభ్ పంత్.. అతడి స్టంపౌట్ చేశాడు. అయితే అతడి ప్రదర్శనతో మంత్రముగ్ధులైన క్రికెట్ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
2008లో ఐపీఎల్ ప్రారంభ సమయానికి వైభవ్ ఇంకా పుట్టనేలేదు. సూర్యవంశీది రైతు కుటుంబం. అతడి తండ్రి ఒక రైతు. అయితే వంశీ నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టిన అతను అండర్-16 ఆడాడు. అనంతరం ఈ ఏడాది చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులోనూ అదిరే ప్రదర్శన చేశాడు. 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. అండర్-19 టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు.
Sleep Tips : ప్రస్తుత కాలంలో చాలామంది కూడా తమ ఈ లైఫ్ లో ఒత్తిళ్ల వల్ల నిద్రకు భంగం…
Cardamom : సాధారణంగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో ఒకటి యాలకులు. యాలకులు సుగంధ వాసనను…
SravanaMasam : రమణ మాసం అంటేనే ఆధ్యాత్మిక తో నిండి ఉంటుంది.అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక రకమైన వాతావరణం…
Numerology : శాస్త్రం ప్రకారం గ్రహాలను బట్టి జాతకాలను అంచనా వేస్తారు అలాగే సంకేయ శాస్త్రం కూడా పుట్టిన తేదీలను…
New Scheme : దేశ వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…
Varalakshmi Vratham 2025 : శ్రావణమాసం వచ్చిందంటే పండుగల వాతావరణం నెలకొంటుంది. ఆ మాసమంతా కూడా అందరూ ఆధ్యాత్మికతతో నుండి…
UPI : యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్తగా ప్రకటించిన రూల్స్ ఎప్పటి…
Pension : తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి…
This website uses cookies.