Virat Kohli : టీమిండియాలో స్టార్ క్రికెటర్స్‌గా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య వైరం నడుస్తుందనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తుంది. ముఖ్యంగా విరాట కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత రోహిత్‌పై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇద్దరికి అస్సలు పడట్లేదని, రోహిత్ వల్లనే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడని ఇలా ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. అయితే వాటన్నింటికి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌తో పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఉప్పల్‌లో జరిగిన ఆఖరి నిర్ణయాత్మక టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని, 2-1 తేడాతో సిరీస్‌ని సొంతం చేసుకుంది…
187 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 4 బంతుల్లో 1 పరుగు చేసిన కెఎల్ రాహుల్‌ని తొలి ఓవర్ ఆఖరి బంతికి అవుట్ చేశాడు డానియల్ సామ్స్. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది భారత జట్టు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కి 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ బౌండరీలతో విరుచుకుపడుతుంటే, విరాట్ కోహ్లీ సింగిల్స్ తీస్తూ అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు…
ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి బంతికి సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి ఆరోన్ ఫించ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎదురొచ్చి మరీ కోహ్లీని అభినందించాడు రోహిత్ శర్మ. అతని ఆటతీరుని మెచ్చుకున్నాడు. ఇక విజయానికి 5 పరుగులే అవసరమైన దశలో ఇద్దరు డగౌట్ మెట్లపై కూర్చొని మ్యాచ్ వీక్షించారు. గెలిచాక ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సన్నివేశాలని చూసి కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు ఉన్నాయని ప్రచారం చేసే వాళ్లు సైలెంట్ అయ్యారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.