
Taxpayers : 75 వేల పన్ను ఆదాకి ఎలాంటి ప్రూఫ్ అక్కర్లేదా..వేతన జీవులు అంతా స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులేనా ?
Taxpayers : పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలా అని అనేక ప్రయత్నాలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం.అయితే వచ్చే ఆర్థిక సంవత్సరా (2025-26)నికి వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌కు సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వ సన్నద్ధం అయ్యారు. ఎప్పటి మాదిరే వేతన జీవులు ఆదాయం పన్ను చట్టంలో మినహాయింపులు పెంచుతారని ఆశిస్తున్నారు. అయితే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. కేంద్ర ప్రభుత్వానికి ప్రీ-బడ్జెట్ సిఫారసుల పేరిట కొన్ని ప్రతిపాదనలు చేసింది. మొత్తం 8.2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులను నూతన ఆదాయం పన్ను విధానంలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది.
Taxpayers : 75 వేల పన్ను ఆదాకి ఎలాంటి ప్రూఫ్ అక్కర్లేదా..వేతన జీవులు అంతా స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులేనా ?
మాములుగా అయితే పాత పన్ను విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ వర్తిస్తుంది. అంటే అంత ఆదాయంపై పన్ను కట్టక్కర్లేదు. ఇంకా.. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగా ఉంది. కొత్త పన్ను విధానంలో రిబేట్ రూ. 7 లక్షల వరకు ఉండగా.. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ గత బడ్జెట్‌లో రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెరిగింది. 1974లో తొలిసారి సెక్షన్ 16 కింద ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ను (ప్రామాణిక తగ్గింపు) అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత పలుమార్లు స్టాండర్డ్ డిడక్షన్ మారుతూ వచ్చింది. 2005-06 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను తొలగించింది. ఆ సమయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 30 వేలు లేదా జీతంలో 40 శాతం ఏది తక్కువైతే అది వర్తించేది.
ఇది రూ. 5 లక్షలలోపు ఆదాయంపై మాత్రమే. ఆపైన ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్ రూ. 20 వేలుగా ఉండేది. ఆదాయపు పన్ను శ్లాబుల విస్తరణ, మినహాయింపుల కారణంగా స్టాండర్డ్ డిడక్షన్ అవసరం లేదని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడి దీనిని తొలగించింది.అయితే 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2018 బడ్జెట్ సమయంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ తీసుకురావడం జరిగింది. అయితే 2019 బడ్జెట్ సమయంలో దీనిని రూ. 50 వేలకు పెంచింది. ఇక కొత్త పన్ను విధానంలో తొలుత స్టాండర్డ్ డిడక్షన్ లేకున్నా.. తర్వాత 2023 బడ్జెట్ సమయంలో దీనిని కొత్త పన్ను విధానానికి కూడా వర్తింపజేసింది. గతేడాది బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో దీనిని రూ. 75 వేలకు పెంచేసింది. శాలరీ ఎంత అనేది సంబంధం లేకుండా.. వేతన జీవులు అంతా స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులే.ఒకవైపు ప్రత్యక్షంగా ఆదాయం పన్ను చెల్లిస్తూ, మరోవైపు అధిక జీఎస్టీ రేట్లు చెల్లించాల్సి వస్తున్నదని మధ్య తరగతి పన్నుచెల్లింపుదారులు అంటున్నారు. ఇది అసమానతలకు దారి తీస్తుందని చెబుతున్నారు. పట్టణాల్లో ఆహార వస్తువుల ధరలు ప్రజల డిస్పోజబుల్ ఇన్‌కం హరించేస్తాయి.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.