
Hyundai Creta : రూ.25 వేలకే హ్యుందాయ్ క్రెటా .. డెలివరి కూడా వెంటనే.. ఎలా దక్కించుకోవాలి..!
Hyundai Creta : హ్యుందాయ్ కార్లలో క్రెటా అత్యంతగా ప్రజాదరణ పొందిన విషయం మనందరికి తెలిసిందే. ఇప్పుడు కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, అత్యుత్తమ పనితీరుతో హ్యుందాయ్ అనేక కార్లని తీసుకొస్తుంది. అయితే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ కు తగ్గట్లు ఆటో మొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్ ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే హ్యుందాయ్ కంపెనీ ఆటో ఎక్స్‌పోలో క్రెటా ఎలక్ట్రిక్‌ను ప్రారంభించింది. దీని ప్రారంభ ధర రూ. 17 లక్షల 99 వేల ఎక్స్-షోరూమ్. ఈ కారును కేవలం రూ.25 వేలకే మనం మన ఇంటికి తీసుకెళ్లవచ్చు.
Hyundai Creta : రూ.25 వేలకే హ్యుందాయ్ క్రెటా .. డెలివరి కూడా వెంటనే.. ఎలా దక్కించుకోవాలి..!
కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూవీ భారతదేశంలోని సాధారణ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా.. దాని ఫీచర్లను, డ్రైవింగ్ ను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.హైఎండ్ ఫీచర్లు కలిగిన కారు ధర రూ.23.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దీని మోడల్ గురించి చూస్తే.. పెట్రోల్-డీజిల్ ఇంజిన్ మోడల్‌ని పోలి ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లను కంపెనీ అందిస్తోంది. మొదటిది 42 kWh బ్యాటరీ ప్యాక్, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించే అవకాశం ఉంది. రెండవది 51.4 kWh బ్యాటరీ ప్యాక్. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఎలక్ట్రిక్ ఫీచర్స్ చూస్తే.. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్యాసింజర్ వాక్-ఇన్ పరికరం వంటి కొన్ని స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ద్వారా వెనుక సీటులో ఉన్న వ్యక్తులు ముందు సీట్లను అడ్జస్ట్ చేసుకునే వీలు ఉంది. దీనితో పాటు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్‌తో కూడిన డ్యూయల్ పవర్డ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS లెవల్ 2, 360 డిగ్రీల కెమెరా, డిజిటల్ కీ అందుబాటులో ఉంటుంది.ఈ మోడల్‌లో కస్టమర్‌లు ఎనిమిది కలర్లలో కార్లను పొందుతారు, ఇందులో రెండు డ్యూయల్-టోన్ రంగులు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌కు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాప్ ఆప్షన్ అందించింది కంపెనీ. దీని ద్వారా వినియోగదారులు సులభంగా చెల్లింపు చేయవచ్చు.క్రెటా ఎన్ లైన్ కార్ బుకింగ్ ఆథరైజేడ్ హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా కారును బుక్ చేసుకునే అవకాశం ఉంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.