iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐఫోన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. తాజాగా విడుదలైన ఐఫోన్ 16 మోడల్స్‌లో 128GB వేరియంట్ ధర రూ.79,990గా, 256GB వేరియంట్ రూ.89,990గా, 512GB వేరియంట్ ధర రూ.1,09,990గా నిర్ణయించబడింది. అయితే ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16 (128GB, బ్లాక్ ఎడిషన్)పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.72,400కి అందుబాటులో ఉంది. పైగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 15ను ఇవ్వడం ద్వారా రూ.35,000 వరకూ తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు కలిపి చూస్తే కొత్త ఐఫోన్ 16ను కేవలం రూ.33,400కి పొందే అవకాశం ఏర్పడింది.
iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!
ఐఫోన్ 16లో అందుబాటులో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్లు మరింత ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 6.1 అంగుళాల Super Retina XDR OLED డిస్‌ప్లే, 2556×1179 పిక్సెల్స్ రెసల్యూషన్‌తో వస్తుంది. నీటి చిందులు, ధూళి నుండి రక్షణ కల్పించే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఈ ఫోన్‌కు ఉన్న ప్రీమియం టచ్‌ను సూచిస్తుంది. 48MP ఫ్యూజన్ కెమెరా (2x టెలిఫోటో లెన్స్‌తో), 12MP అల్ట్రావైడ్ కెమెరా, 12MP TrueDepth ఫ్రంట్ కెమెరా వంటి ఆధునిక కెమెరా ఫీచర్లతో మల్టీ-డైమెన్షనల్ స్పేషియల్ ఫోటోలు, వీడియోలను అత్యున్నత స్థాయిలో రికార్డ్ చేయగలుగుతారు. అలాగే ఫోటో యాక్సెస్ వేగవంతం కావడం, విజువల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వస్తువులను గుర్తించడం వంటి అంశాలు దీన్ని మరింత ప్రత్యేకత కలిగించినవి.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. A18 బయోనిక్ చిప్‌ను 3nm టెక్నాలజీతో రూపొందించి, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ద్వారా అధిక శక్తివంతమైన ప్రాసెసింగ్ పవర్‌ను అందిస్తోంది. iOS 18లో వచ్చిన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో AI ఆధారిత టెక్స్ట్ రివైటింగ్, కాల్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్ట్ వంటి ఫీచర్లను అనుభవించవచ్చు. ఈ డీల్ ద్వారా సాధారణంగా అందుబాటులో లేని ధరకు కొత్తగా విడుదలైన ఐఫోన్ 16ను సొంతం చేసుకునే అరుదైన అవకాశం వినియోగదారులకు లభించనుంది.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.