Home » Exclusive » Oppo Launches 4g A77 Smart Phone
Exclusive

Oppo A77 : అదిరిపోయే ఫీచర్స్ తో ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 8, 2022 9:38 pm
Advertisement

Oppo A77 : ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అయింది. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిది ఏ పని కావడం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే జేబులో పర్స్ అయినా మర్చిపోతారేమో కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం మర్చిపోరు. అంతలా బానిసలు అయిపోయారు ఫోన్లకి. ఇంట్లో కూర్చొని అన్నింటిని ఆన్లైన్ ద్వారా ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఫుడ్ షాపింగ్, మనీ ట్రాన్స్ఫర్ ఇలా ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ల ద్వారా చేసుకుంటున్నారు. అందుకే మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి మొబైల్ కంపెనీలు. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో తాజాగా భారత్ మార్కెట్లోకి కొత్త ఫోను విడుదల చేసింది.

Advertisement

అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో ఏ 77 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ 4జీ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. ఇటీవల వరుసగా బడ్జెట్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని వస్తున్న ఒప్పో తాజాగా ఇలాంటి మరో ఫోను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. ఒప్పో ఏ77లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని అందించారు. సూపర్ వూక్ చార్జర్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ సామర్ధ్య ఉన్న బ్యాటరీని అందించారు. ఈ ఫోను ఐదు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే మూడు గంటలపాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు.

Oppo launches 4G a77 smart phone

Advertisement

3.5 ఎంఎం ఆడియో జాక్ 4జీ తో పాటు వైఫై బ్లూటూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.17,999 గా ఉంది. పలు బ్యాంకుల క్రెడిట్ డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10% క్యాష్ బ్యాక్ పొందే వీలు ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ రేయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. రేయిర్ కెమెరాకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతికతను జోడించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో పనిచేసే ఈ ఫోన్ లో మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ని పెంచుకోవచ్చు. ఈ స్పాట్ ఫోన్ శుక్రవారం నుంచి ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ తో పాటు ఒప్పో స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి