Home » News » Redmi K100 Review 200mp Periscope Camera 9000mah Battery With 150w Charging
News

Redmi K100 Review : రెడ్‌మీ నుంచి కొత్త బీస్ట్ ఫోన్.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 11, 2026 7:58 pm
Advertisement

Redmi K100 Review : సాధారణంగా రెడ్‌మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రెడ్ మీ తన రూట్ మార్చింది. బడ్జెట్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, లక్షల ఖరీదు చేసే ప్రీమియం ఫోన్లకు చెమటలు పట్టించేలా ఒక కొత్త ‘బీస్ట్’ను తయారు చేస్తోంది. అదే Redmi K100 సిరీస్. తాజాగా బయటకు వచ్చిన లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

Advertisement

Redmi K100 Review : రెడ్‌మీ నుంచి కొత్త బీస్ట్ ఫోన్.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది..!

Redmi K100 Review : ప్రధాన హైలైట్: 200MP పెరిస్కోప్ కెమెరా

చైనాకి చెందిన ప్రముఖ టిప్‌స్టర్ ‘స్మార్ట్ పికాచు’ Smart Pikachu సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన లీక్ ఇచ్చారు. దీని ప్రకారం, రాబోయే Redmi K100 సిరీస్‌లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండబోతోంది. ఇది కేవలం పేరుకే కాదు, నిజంగానే దూరంగా ఉన్న వస్తువులను అత్యంత క్లారిటీతో జూమ్ చేయడానికి ఉపయోగపడే రియల్ హార్డ్‌వేర్ అని సమాచారం. ప్రస్తుతం ఈ కెమెరా మాస్ ప్రొడక్షన్ టెస్టింగ్ దశలో ఉంది. అంటే త్వరలోనే మనం దీన్ని మార్కెట్లో చూడొచ్చు.

Advertisement

Redmi K100 Review :అంచనా వేస్తున్న ఇతర ఫీచర్లు ఇవే

బ్యాటరీ: ఈ ఫోన్ లో ఏకంగా 9000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది నిజమైతే బ్యాకప్ విషయంలో తిరుగుండదు.

చార్జింగ్: ఇంత పెద్ద బ్యాటరీని నింపడానికి 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వనున్నట్లు టాక్.

Advertisement

POCO F9 Ultra పేరుతో గ్లోబల్ ఎంట్రీ?

చైనాలో ఈ ఫోన్లు Redmi K100, Redmi K100 Pro Max పేర్లతో విడుదల కావచ్చు. కానీ భారత్, గ్లోబల్ మార్కెట్‌లో ఇవి POCO బ్రాండింగ్ తో వచ్చే అవకాశం ఉంది.

Redmi K100… POCO F9 Pro గా రావచ్చు. Redmi K100 Pro Max.. POCO F9 Ultra గా రావచ్చు. ముఖ్యంగా ‘Ultra’ అనే పదాన్ని పోకో వాడటం ఇదే తొలిసారి కావచ్చు. ఇప్పటివరకు ప్రో Pro వరకే ఆగిపోయిన పోకో, ఇప్పుడు శాంసంగ్ అల్ట్రా మోడల్స్ కు పోటీగా ఈ ఫోన్ ను దించే ప్లాన్ లో ఉంది.

200MP కెమెరా ఎందుకు అంత స్పెషల్?

సాధారణంగా ప్రీమియం ఫోన్లలో 50MP లేదా 64MP పెరిస్కోప్ కెమెరాలు ఉంటాయి. కానీ రెడ్ మీ ఏకంగా 200MP ని తీసుకురావడం సాహసమే. జూమ్ చేసినప్పుడు ఫోటోలు పిక్సలేట్ అవ్వకుండా, క్రిస్టల్ క్లియర్ గా రావడానికి ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉపయోగపడతాయి. అయితే రాత్రి వేళల్లో ఫోటోలు ఎలా వస్తాయనేది సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది.

రెడ్ మీ K100 సిరీస్ కనుక నిజంగానే ఈ ఫీచర్లతో తక్కువ ధరకు వస్తే, స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం. అయితే ఇవన్నీ లీక్స్ మాత్రమే కాబట్టి, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

Advertisement

గమనిక(Disclaimer): ఈ ఆర్టికల్ అనధికారిక లీక్స్, నివేదికల ఆధారంగా రాయబడింది. ఫోన్ విడుదలయ్యే సమయానికి ఫీచర్లు లేదా పేర్లు మారే అవకాశం ఉంది.

 

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి